సీఎం రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటన.. ఏ రోజు ఏ సభలో పాల్గొంటారో తెలుసా?

CM Revanth Reddy: నేటి నుంచి మే 11 వరకు 17 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో రేవంత్ రెడ్డి పర్యటిస్తారు.

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేటి నుంచి సుడిగాలి పర్యటన చేపట్టనున్నారు. తెలంగాణలో లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్ ను గెలిపించే బాధ్యతను తన భుజాలపై వేసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పెట్టుకున్న టార్గెట్ 14ను సాధించేలా ప్రణాళిక వేసుకున్నారు. తమ సర్కారు పాలనకు ఈ ఎన్నికలు రెఫరెండమ్ అని ఇప్పటికే రేవంత్ రెడ్డి అన్నారు.

నేటి నుంచి ఆయన ప్రచారాన్ని ఉద్ధృతం చేయనున్నారు. నేటి నుంచి మే 11 వరకు 17 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో రేవంత్ రెడ్డి పర్యటిస్తారు. మొత్తం 50 సభలు, ర్యాలీలు నిర్వహించేలా ప్రణాళికలు వేసుకున్నారు. ఇవాళ సాయంత్రం మహబూబాబాద్ లో జరిగే బహిరంగ సభలోనూ రేవంత్ పాల్గొంటారు.

రేవంత్ పాల్గొనే ర్యాలీలు

  • 20న మెదక్ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా ర్యాలీ, సభ
  • 21న భువనగిరి లో పార్టీ అభ్యర్థి చామల కిరణ్ నామినేషన్ కార్యక్రమంలో రేవంత్
  • 22న మధ్యాహ్నం ఆదిలాబాద్ లో సభ
  • 23న నాగర్ కర్నూల్ జరిగే బహిరంగ సభ
  • 24న ఉదయం జహిరాబాద్, సాయంత్రం వరంగల్ లో సభ
  • 25 న చేవెళ్ల అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి మద్దతుగా ర్యాలీ, సభ

ట్రెండింగ్ వార్తలు