మంత్రుల పనితీరుపై ఆరా తీస్తున్న సీఎం రేవంత్.. ఇంటెలిజెన్స్ రిపోర్ట్‌ ఆధారంగా మార్పులు, చేర్పులు?

పబ్లిక్ నుంచి నెగెటివ్‌ ఫీడ్‌ బ్యాక్ వచ్చిన మంత్రులు, కరప్షన్ అలిగేషన్స్‌ ఉన్న మినిస్టర్ల విషయంలో ఎలాంటి స్టెప్‌ తీసుకోవాలనే దానిపై సన్నిహితులతో చర్చిస్తున్నారట సీఎం.

CM Revanth Reddy

ఏడాది పాలన పూర్తి చేసుకున్న సీఎం రేవంత్‌ రెడ్డి.. ఇక నుంచి ప్రతి అంశంపై పట్టు సాధించే యోచనలో ఉన్నారు. అటు అధికారులు..ఇటు క్యాబినెట్ సహచరుల పనితీరు మీద ఇప్పటికే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకున్న సీఎం మార్పులు, చేర్పులు చేయాలని భావిస్తున్నారట. తన దూకుడుకు తగ్గట్లుగా పనిచేయని అధికారుల తీరుపై ఇప్పటికే అసంతృప్తి వ్యక్తం చేశారట.

త్వరలోనే కొందరు ఉన్నతస్థాయి అధికారుల బదిలీలు కూడా ఉంటాయని అంటున్నారు. అంతేకాదు ఏడాది పాలనలో అమాత్యుల పనితీరు ఎలా ఉందని కూడా రేవంత్ ఆరా తీసినట్లు తెలుస్తోంది. పలువురు మంత్రుల పనితీరుపై ప్రజల్లో నెగెటివ్ టాక్ ఉందని సీఎం దృష్టికి వచ్చిందంటున్నారు. ఒకరిద్దరు మంత్రుల అవినీతి ఆరోపణల వ్యవహారం ముఖ్యమంత్రి దగ్గరకు వెళ్లిందట.

ఆయా శాఖల్లో మంత్రులు సాధించిన విజయాలు, ఫెయిల్యూర్స్‌పై ముఖ్యమంత్రి కార్యాలయం రిపోర్ట్ తయారు చేసిందని సచివాలయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కొందరు మంత్రుల పనితీరుపై సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. పలువురు మినిస్టర్ల అవినీతి భాగోతంపై సీరియస్‌గా ఉన్న ముఖ్యమంత్రి..మంత్రివర్గ విస్తరణలో వారి శాఖలను మార్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా ఇద్దరు ముగ్గురు మంత్రులు పెద్దఎత్తున అవినీతికి పాల్పడుతున్నారని ఇంటెలిజెన్స్ అధికారులు సీఎంకు రిపోర్టు ఇచ్చారట.

ఐబీ నివేదికలో మంత్రుల అక్రమాలు?
ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి టేబుల్ మీద ఉన్న ఐబీ నివేదికలో మంత్రుల అక్రమాలు, అవినీతికి సంబంధించిన వివరాలు ఉన్నట్లు సచివాలయ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే ఆయా మంత్రులపై ఎటువంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై రేవంత్ సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అక్రమాలకు పాల్పడుతూ..అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న మంత్రుల అంశాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లేందుకు ముఖ్యమంత్రి సిద్దమవుతున్నారని టాక్‌.

త్వరలో మంత్రివర్గ విస్తరణ జరగనుంది. ఆరు బెర్తులను భర్తీ చేయబోతున్నారు. అదే సమయంలో పనితీరు సరిగా లేని మంత్రుల శాఖలను మార్చే అవకాశం ఉందంటున్నారు. కొందరిని అయితే తప్పించే అవకాశం కూడా లేకపోలేదన్న చర్చ జరుగుతోంది. దీంతో ఏ మంత్రి శాఖ మారబోతుంది..కరప్షన్ అలిగేషన్స్ ఎదుర్కొంటున్న అమాత్యులు ఎవరనే దానిపై సెక్రటేరియట్‌లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. కొందరు మంత్రుల మీద వచ్చిన నెగెటివ్‌ ఫీడ్‌ బ్యాక్‌ను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లబోతున్నారట సీఎం రేవంత్.

డిసెంబర్ 9తో ప్రజావిజయోత్సవాలు ముగుస్తాయి. ఆ తర్వాత సెక్రటేరియట్‌లో పూర్తిస్థాయి ప్రక్షాళనకు రెడీ అవుతున్నారట సీఎం. అధికార యంత్రాంగాన్ని తన గ్రిప్‌లోకి తెచ్చుకుని పాలనను పరుగులు పెట్టించాలని ఫిక్స్ అయ్యారట. అందులో భాగంగా మంత్రుల పనితీరు, వాళ్ల మీద వస్తున్న ఆరోపణలపై ఓ కన్నేసి పెట్టారని అంటున్నారు.

అయితే పబ్లిక్ నుంచి నెగెటివ్‌ ఫీడ్‌ బ్యాక్ వచ్చిన మంత్రులు, కరప్షన్ అలిగేషన్స్‌ ఉన్న మినిస్టర్ల విషయంలో ఎలాంటి స్టెప్‌ తీసుకోవాలనే దానిపై సన్నిహితులతో చర్చిస్తున్నారట సీఎం. ప్రజా విజయోత్సవాలు ముగిశాక.. హైకమాండ్‌ పెద్దల దృష్టికి తీసుకెళ్లి మార్పులు, చేర్పులకు శ్రీకారం చుడుతారని అంటున్నారు. ఏ మంత్రి శాఖ మారబోతుందో..అధిష్టానం ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరి.

సడెన్‌గా పవన్ కల్యాణ్ మీద ప్రేమ ఒలకబోస్తున్న ఫ్యాన్ పార్టీ లీడర్లు