విభజన హామీలపై అభిషేక్ సింఘ్వి చట్టసభలలో మాట్లాడతారు- సీఎం రేవంత్ రెడ్డి

రైతు కృతజ్ఞత సభ, రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ కార్యక్రమంపై త్వరలో ఢిల్లీ పెద్దలతో మాట్లాడి త్వరలో తేదీ వెల్లడిస్తాము.

Cm Revanth Reddy (Photo Credit : Facebook)

Cm Revanth Reddy : ఏఐసీసీ ఆదేశాల మేరకు అభిషేక్ సింఘ్విని రాజ్యసభ అభ్యర్థిగా నిర్ణయిస్తూ తీర్మానం చేశామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, లోక్ సభ, రాజ్యసభ ఎంపీలో సీఎల్పీ సమావేశం జరిగిందన్నారు. రేపు(ఆగస్టు 19) ఉదయం 10 గంటలకు అసెంబ్లీలో అభిషేక్ సింఘ్వి నామినేషన్ వేస్తారని రేవంత్ వెల్లడించారు. అందుబాటులో ఉన్న ప్రజాప్రతినిధులు అసెంబ్లీకి వస్తారని, నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటారని ఆయన తెలిపారు.

”విభజన హామీల్లో మనకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చట్టబద్దత కల్పించారు. కానీ, అవేవీ అమలు కాలేదు. వాటిపై చట్ట సభలలో, కోర్టులలో కూడా అభిషేక్ సింఘ్వి మాట్లాడతారు. రైతు కృతజ్ఞత సభ తొందరలోనే ఉంటుంది. రాజీవ్ గాంధీ విగ్రహ ఆవిష్కరణ డేట్లు వీలు కాలేదు. రైతు కృతజ్ఞత సభ, రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ కార్యక్రమంపై త్వరలో ఢిల్లీ పెద్దలతో మాట్లాడి త్వరలో తేదీ వెల్లడిస్తాము” అని రేవంత్ రెడ్డి తెలిపారు.

అభిషేక్ సింఘ్వి- రాజ్యసభ అభ్యర్థి
‘నన్ను రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించినందుకు ఎఐసిసి పెద్దలకు కృతజ్ఞతలు. మర్యాద పూర్వకంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను, ఎంపీలను కలిశా. రాష్ట్రానికి రావాల్సిన హక్కుల విషయంలో నేను మాట్లాడుతూనే ఉంటాను”.

Also Read : మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ

ట్రెండింగ్ వార్తలు