Komatireddy Raj Gopal Reddy
Cm Revanth Reddy : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పార్లమెంట్ ఎన్నికలపై నాయకులకు సీఎం రేవంత్ దిశానిర్దేశం చేశారు. అలాగే ఈ నెల 21న భువనగిరిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఇతర కీలక నాయకులు హాజరయ్యారు.
ఈ నెల 14 నుంచి మే 11 దాకా సీఎం రేవంత్ సభలు జరగనున్నాయి. 100 రోజుల కాంగ్రెస్ పాలనపై ప్రచార పత్రాలు తయారు చేసిన కాంగ్రెస్.. పాలనా నిర్ణయాలను ప్రజల్లో ప్రచారం చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నాయకులను ఆదేశించారు సీఎం రేవంత్.
భువనగిరిలో చామల కిరణ్ కుమార్ గెలుపు ఖాయమని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 21న భువనగిరి అభ్యర్థి చామల కిరణ్ కుమార్ నామినేషన్ వేస్తారని తెలిపారు. నామినేషన్ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హాజరవుతారని వెల్లడించారు. మే మొదటి వారంలో చౌటుప్పల్, మిర్యాలగూడలో సభలు ఉంటాయని, ఈ సభలకు ప్రియాంక గాంధీ హాజరవుతారని రాజగోపాల్ రెడ్డి తెలిపారు.