Cm Revanth Reddy: అసెంబ్లీకి అందరూ కచ్చితంగా రావాల్సిందే.. 3సార్లు అటెండెన్స్.. మాటలు జాగ్రత్త- ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్

రాష్ట్ర స్థాయి విషయాలు మాట్లాడొద్దని సూచించారు. అనవసరపు కాంట్రవర్సీలు వద్దన్నారు.

  • Published On : March 16, 2026 / 05:40 PM IST
  • సభ్యులందరూ సభకు రావాల్సిందే
  • మూడు సార్లు అటెండెన్స్ తీసుకుంటాం
  • సబ్జెక్ట్ మీద ప్రిపేర్ అవ్వాలి
  • బీఆర్ఎస్ నేతల నెగిటివ్ మాత్రమే కాదుమనం చేస్తున్న పాజిటివ్ ను కూడా చెప్పాలి

Cm Revanth Reddy: సీఎల్పీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీకి సభ్యులు అందరూ కచ్చితంగా అటెండ్ కావాల్సిందేనని తేల్చి చెప్పారు. సభకు వచ్చి అటెండెన్స్ వేసుకొని వెళ్తామంటే కుదరదని స్పష్టం చేశారు. అటెండెన్స్ కచ్చితంగా మూడుసార్లు తీసుకుంటామన్నారు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అటెండెన్స్ ఉంటుందన్నారు.

ఎమ్మెల్యేలు సబ్జెక్ట్ మీద కూడా ప్రిపేర్ కావాలని సీఎం రేవంత్ సూచించారు. బీఆర్ఎస్ నేతల నెగిటివ్ మాత్రమే కాదు.. మనం చేస్తున్న పాజిటివ్ ను కూడా చెప్పాలని వారికి దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్ చేయలేదు కాబట్టే.. మనకు అధికారం ఇచ్చారని.. ఎంతసేపు వాళ్ళ నెగిటివ్ చెప్పడం కాదని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. మున్సిపల్, లోకల్ బాడీ ఎన్నికలు, ఉప ఎన్నికల్లో ఓడిపోయారు కాబట్టి ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు కసి మీద ఉన్నారని, మనం సీరియస్ గా ఉండాలని రేవంత్ అన్నారు.

అసెంబ్లీ కమిటీలను ఫుల్ ఫిల్ చేయాలన్నారు. ఎమ్మెల్యేలు స్టడీ టూర్ వెళ్లాలన్నారు. ఇక మీడియా ముందు మాట్లాడేటప్పుడు, చిట్ చాట్ చేసేటప్పుడు ఎమ్మెల్యేలు మరింత జాగ్రత్తగా ఉండాలని సీఎం రేవంత్ నొక్కి మరీ చెప్పారు. మీ నియోజకవర్గం వరకు మాట్లాడితే బాగుంటుందన్నారు. రాష్ట్ర స్థాయి విషయాలు మాట్లాడొద్దని వారికి సూచించారు. అనవసరపు కాంట్రవర్సీలు జోలికి వెళ్లొద్దన్నారు. వివాదాస్పద వ్యాఖ్యలతో మీరే ప్రతిపక్షం లాగా ఇరుక్కోకండి అని జాగ్రత్తలు చెప్పారు. ఇటీవల ఎమ్మెల్యే మందుల సామెల్ కామెంట్స్ వివాదంగా మారడంతో సీఎం రేవంత్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.

Also Read: వారికి మాత్రమే ‘రైతు భరోసా’ నిధులు.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం..