బీఆర్ఎస్‌కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్.. మ్యానిఫెస్టోలపై చర్చకు ప్రభుత్వం సిద్ధమని ప్రకటన

బీఆర్ఎస్ రెండు మ్యానిఫెస్టోలు, కాంగ్రెస్ ఆరు గ్యారంటీలపై ప్రత్యేక అసెంబ్లీ నిర్వహించి చర్చించేందుకు సిద్దమా అని రేవంత్ రెడ్డి సవాలు విసిరారు.

CM Revanth Reddy: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో సింగరేణి కార్మికులది కీలక పాత్ర అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సింగరేణి ఉద్యోగులకు ప్రమాద బీమా పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో సింగరేణి కార్మికులు నిర్లక్ష్యానికి గురయ్యారని విమర్శించారు.

బీఆర్ఎస్ రెండు మ్యానిఫెస్టోలు, కాంగ్రెస్ ఆరు గ్యారంటీలపై ప్రత్యేక అసెంబ్లీ నిర్వహించి చర్చించేందుకు సిద్దమా అని రేవంత్ రెడ్డి సవాలు విసిరారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మ్యానిఫెస్టోలపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. బీఆర్ఎస్-బీజేపీ నేతలు అక్కసుతో కాంగ్రెస్ ప్రభుత్వం విషం కక్కుతున్నారని తెలిపారు.

మోదీకి మూడోసారి అవకాశం ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారు. కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి రాష్ట్రానికి ఏం తెచ్చారని నిలదీశారు. కేసీఆర్, మోదీ ఇద్దరూ తెలంగాణ ప్రజలను మోసం చేశారని అన్నారు. వారు ఏం చేశారని ఒట్లేయాలని ప్రశ్నించారు. కాంగ్రెస్ రేపు గ్యాస్ సిలిండర్, గృహ జ్యోతి కార్యక్రమం ప్రారంభిస్తుందని తెలిపారు.

గత పాలకులు సృష్టించిన సమస్యలను తాము ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు. రైతు బంధును మార్చి31లోపు చెల్లిస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. ఆర్థిక నియంత్రణ పాటిస్తున్నామని అన్నారు. ప్రతి వనరును అంచనా వేసుకుంటూ పాలన కొనసాగిస్తున్నామని చెప్పారు.

కేటీఆర్, హరీశ్ రావు చేస్తున్న వ్యాఖ్యలు వింటుంటే జాలి కలుగుతుందని రేవంత్ రెడ్డి అన్నారు. వారు చేస్తున్న వ్యాఖ్యలను బీఆర్ఎస్ కార్యకర్తలే పట్టించుకోవడం లేదని చెప్పారు. నిరుద్యోగులను గత ప్రభుత్వం నిర్లక్ష్యంతో గాలికొదిలేసిందని అన్నారు.

Also Read: టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యే.. అందుకేనట..

ట్రెండింగ్ వార్తలు