Cm Revanth Reddy: ఒట్టేసి చెబుతున్నా.. మళ్లీ కేసీఆర్ రావడం అనేది జరగదు.. ప్రతిపక్షాలపై మండిపడ్డ రేవంత్ రెడ్డి

తెలంగాణలో 2034 వరకు కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Cm Revanth Reddy) ధీమా వ్యక్తం చేశారు.

CM Revanth Reddy made sensational comments stating that Congress party would remain in power in Telangana until 2034.

  • 2034 వరకు కాంగ్రెసే అధికారంలో
  • రెండున్నరేళ్ల పాలనపై చర్చకు సవాల్
  • కాళేశ్వరం నీళ్లు లేకుండానే పంటలు

Cm Revanth Reddy: తెలంగాణలో 2034 వరకు కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంటుందని, వచ్చే ఎన్నికల్లో తమ విజయాన్ని ఎవరూ ఆపలేరని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనపై, తమ రెండున్నరేళ్ల పాలనపై అసెంబ్లీలో ఎన్ని రోజులైనా చర్చకు సిద్ధమని ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. కేసీఆర్ లాంటి వారు మళ్లీ వస్తే రాష్ట్రం ఏమవుతుందో ప్రజలకు తెలుసని, వేల కోట్లు దోచుకున్న వారు తెలంగాణకు అవసరం లేదని మండిపడ్డారు.

Harish Rao: గుంపు మేస్త్రి కాదు ముంపు మేస్త్రీ.. రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్ సీఎం.. హరీష్ రావు సంచలన కామెంట్స్

తమ హయాంలో నిరుపేదలకు సన్నబియ్యం అందిస్తున్నామని, గతంలో కేసీఆర్ తిన్న సన్నబియ్యమే నేడు పేదలు తింటున్నారని రేవంత్ రెడ్డి(Cm Revanth Reddy) పేర్కొన్నారు. రూ.500 కే గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇళ్లు ఇస్తుంటే ప్రతిపక్షాలకు కడుపుమంట ఎందుకని ప్రశ్నించారు. ఈ 30 నెలల్లోనే సంక్షేమం కోసం లక్ష కోట్లకు పైగా ఖర్చు చేశామని వివరించారు.

గత ప్రభుత్వం లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయినా, ఆ నీళ్లు లేకుండానే తాము రికార్డు స్థాయిలో పంట ఉత్పత్తి సాధించామని సీఎం స్పష్టం చేశారు. కేంద్రంతో మాట్లాడి రైతులకు యూరియా కష్టాలు లేకుండా చేశామని, 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని చెప్పారు. గురుకులాల ద్వారా వందలాది మంది అంబేద్కర్‌లను తయారుచేసి గిరిజనులకు మెరుగైన విద్య అందిస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.