Harish Rao: గుంపు మేస్త్రి కాదు ముంపు మేస్త్రీ.. రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్ సీఎం.. హరీష్ రావు సంచలన కామెంట్స్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి "గుప్పు మేస్త్రీ" కాదు, రాష్ట్రాన్ని ముంచేస్తున్న "ముంపు మేస్త్రీ" అని మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) తీవ్రస్థాయిలో ఎద్దేవా చేశారు.
Harish Rao sensational comments about CM Revanth Reddy and Telangana government
- రేవంత్ రెడ్డి ముంపు మేస్త్రీ
- రైతు బంధుపై చర్చకు సవాల్
- ధాన్యం కొనక రైతుల కన్నీరు
Harish Rao: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి “గుప్పు మేస్త్రీ” కాదు, రాష్ట్రాన్ని ముంచేస్తున్న “ముంపు మేస్త్రీ” అని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో ఎద్దేవా చేశారు. సిద్దిపేటలో నిర్వహించిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డిని రైతు బంధు పథకాన్ని మూడు సార్లు ఎగ్గొట్టిన వైఫల్య ముఖ్యమంత్రిగా అభివర్ణించారు. రైతు బంధు నిధుల పంపిణీపై శాసనసభలో చర్చకు రావాలని సీఎంకు సవాల్ విసిరారు.
Kishan Reddy: తెలంగాణలో వాళ్ళ ఓట్లు తొలగించాల్సిందే.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ధాన్యం అమ్ముకోలేక రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారని హరీష్ రావు(Harish Rao) ఆవేదన వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో తాము ఏకంగా 92 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని గుర్తు చేశారు. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేవలం 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేసి, గొప్పలు చెప్పుకోవడం విచిత్రంగా ఉందన్నారు. అందుకే నేడు ప్రతి రైతు కేసీఆర్ పాలనను గుర్తు చేసుకుంటున్నారని తెలిపారు.
మరోవైపు ఎస్ఎల్బీసీ (SLBC) టన్నెల్స్ ప్రాజెక్టును బీఆర్ఎస్ ప్రభుత్వం 12 కిలోమీటర్ల మేర తవ్వించిందని హరీష్ రావు పేర్కొన్నారు. అయితే ప్రస్తుత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఎస్ఎల్బీసీలో ప్రమాదం జరిగి కార్మికులు చనిపోతే, కనీసం వారి శవాలను కూడా బయటకు తీయలేకపోయారని కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాన్ని తీవ్రంగా విమర్శించారు.
