Ram charan : ‘మల్లెపూల పల్లకి బంగారు పల్లకి’ పాటలో రామ్‌చరణ్.. క్లారిటి వచ్చేసింది
రవితేజ హీరోగా నటిస్తున్న ఇరుముడి చిత్రంలోని మల్లెపూల పల్లకి బంగారు పల్లకి పాటలో రామ్‌చరణ్ (Ram charan) కనిపించనున్నారు అనే విషయం పై క్లారిటీ వచ్చేసింది.
Hero Ram charan cameo in Irumudi mallepoola pallaki Song here the clarity
Ram charan : రవితేజ హీరోగా నటిస్తున్న చిత్రం ఇరుముడి. శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ అతిథి పాత్రలో కనిపించనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తోంది. ఈ చిత్రంలోని మల్లెపూల పల్లకి బంగారు పల్లకి అంటూ సాగే పాటలో చరణ్ అయ్యప్ప మాలధారణలో కనిపించనున్నారని సదరు వార్తల సారాంశం. తాజాగా వీటిపై రామ్‌చరణ్ టీమ్ స్పందించింది. అవన్నీ వట్టి రూమర్లేనని చెప్పింది. తప్పుడు ప్రచారం చేయొద్దు అని కోరింది.
ఈ నెల 21 ఇరుముడి చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈక్రమంలో ఇటీవల ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు జీవి ప్రకాశ్ కుమార్ మాట్లాడుతూ.. ఈ చిత్రంలోని ఈ పాటలో (మల్లెపూల పల్లకి బంగారు పల్లకి) అదిరిపోయే సర్ప్రైజ్ ఉంటుందని చెప్పుకొచ్చాడు. దీంతో ఈ పాటలో రామ్‌చరణ్ కనిపించనున్నారనే ప్రచారం మొదలైంది.
Wamiqa Gabbi : డీసీ మూవీలో చంద్ర పాత్ర వర్కింగ్ స్టిల్స్‌ను షేర్ చేసిన వామిక.. ఫోటోలు వైరల్
