Cm Revanth Reddy: కేసీఆర్ కున్న ప్రతిపక్ష హోదా ఊడగొట్టకపోతే నా పేరు మార్చుకుంటా- సీఎం రేవంత్ చాలెంజ్
దేశంలోనే అత్యధిక మెజారిటీతో మళ్లీ అధికారంలోకి వస్తామని రేవంత్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో 15 మంది ఎంపీలను గెలిపించి రాహుల్ గాంధీని ప్రధాని చేద్దామని పిలుపునిచ్చారు.
- Naveen
- Published on- April 20, 2026 / 11:32 PM IST
Cm Revanth Reddy: తెలంగాణలో రాజకీయం వేడెక్కింది. సీఎం, మాజీ సీఎం మధ్య మాటల తూటాలు పేలాయి. సై అంటే సై అంటూ రేవంత్ రెడ్డి, కేసీఆర్ సవాళ్లు విసురుకున్నారు. జగిత్యాలలో కేసీఆర్, భూపాలపల్లిలో రేవంత్ పరస్పర విమర్శలతో విరుచుకుపడ్డారు. తమ కార్యకర్తలు కేసీఆర్ ను గోతి తీసి పాతరేస్తారని రేవంత్ హెచ్చరించారు. ఆయన వెయ్యి జన్మలెత్తినా నేను చావను అని కేసీఆర్ కౌంటర్ ఇచ్చారు.
భూపాలపల్లిలో బహిరంగ సభలో మాట్లాడిన సీఎం రేవంత్.. కేసీఆర్ టార్గెట్ గా నిప్పులు చెరిగారు. 2029 ఎన్నికల్లో తేల్చుకుందాం.. దమ్ముంటే రండి అంటూ బీఆర్ఎస్ నేతలకు సవాల్ విసిరారు. కేసీఆర్ కు ఉన్న ప్రతిపక్ష హోదా ఊడగొట్టకపోతే తన పేరు మార్చుకుంటానన్నారు. దేశంలోనే అత్యధిక మెజారిటీతో మళ్లీ అధికారంలోకి వస్తామని రేవంత్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో 15 మంది ఎంపీలను గెలిపించి రాహుల్ గాంధీని ప్రధాని చేద్దామని పిలుపునిచ్చారు.
అటు జగిత్యాల సభలో సీఎం రేవంత్ టార్గెట్ గా నిప్పులు చెరిగారు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్. పొద్దున లేస్తే నేను చావాలి అంటున్నారు, నువ్వు వెయ్యి జన్మలెత్తినా నేను చావను అని కేసీఆర్ అన్నారు. చివరి శ్వాస ఉన్నంతవరకు పని చేస్తూనే ఉంటానన్నారు.
