Rythu Bharosa: రైతులకు గుడ్‌న్యూస్.. ఖాతాల్లోకి డబ్బులు జమ..
రెండో విడతలో 45 లక్షల 11 వేల 947 మంది రైతుల ఖాతాల్లో రూ.5,563 కోట్లు జమ కానున్నాయి.
- Naveen
- Updated on- April 20, 2026 / 09:13 PM IST
Rythu Bharosa: తెలంగాణలోని రైతులకు గుడ్ న్యూస్. రైతు భరోసా రెండో విడత నిధులను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. భూపాలపల్లి జిల్లా కాటారం మండలం నస్తూరుపల్లి గ్రామంలో బహిరంగ సభలో పాల్గొన్న సీఎం రేవంత్.. రైతు భరోసా నిధులను రిలీజ్ చేశారు. రెండో విడతలో 45 లక్షల 11 వేల 947 మంది రైతుల ఖాతాల్లో రూ.5,563 కోట్లు జమ కానున్నాయి. రైతు భరోసా తొలి విడత నిధులను గత నెల 23న ప్రభుత్వం పంపిణీ చేసింది. తొలి విడతలో రూ.3,590 కోట్లను రైతులకు బదిలీ చేసింది. మూడో విడత నిధులను వచ్చే నెలలో ప్రభుత్వం విడుదల చేయనుంది. మే కల్లా లబ్దిదారుల ఖాతాల్లో ఎకరానికి రూ.6 వేల చొప్పున జమ కానున్నాయి.
Also Read: మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ సర్కారే, జీవన్ రెడ్డికి కీలక పదవి- కేసీఆర్
