Rythu Bharosa 1 Acer : తొలి విడతలో ఎకరాకే రైతు భరోసా సాయం.. మిగతా వారికి డబ్బులు ఎప్పుడు జమ చేస్తారంటే..
Rythu Bharosa 1 Acer : రైతు భరోసా నిధులు ముందుగా ఎకరం భూమి ఉన్న రైతుల వరకే విడుదలయ్యాయి. మరి మిగతా వారి సంగతేంటంటే..
- Dharani Pilli
- Published On : March 23, 2026 / 08:45 AM IST
cm revanth reddy Released rythu bharosa funds for 1 acer farmers and credit rs 3600 crore in accounts
Rythu Bharosa 1 Acer : తెలంగాణ రైతాంగం ఆత్రుతగా ఎదురు చూస్తోన్న రైతు భరోసా డబ్బులు విడుదలయ్యాయి. ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీటిని విడుదల చేశారు. ఈ క్రమంలో నార్కెట్‌పల్లిలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. తర్వాత జరిగిన సభలో సీఎం రైతు భరోసా నిధులను విడుదల చేశారు. ముందుగా ఎకరం వరకు భూములకు రైతు భరోసా నిధులు జమ చేశారు. ఆదివారం బ్యాంకులకు సెలవు కావడంతో.. ఆ డబ్బులు నేడు రైతుల ఖాతాల్లో జమ అవుతాయి.
68.90 లక్షల మందికి రైతు భరోసా నిధులు జమ చేయనున్నారు. ఈ క్రమంలో ఆదివారం నాడు 57.45 లక్షల ఎకరాలకు గాను రూ. 3,446.94 కోట్ల నిధులు విడుదల చేశారు. నేడు ఈ మొత్తం రైతుల ఖాతాల్లో జమ కానుంది.
మరో 45 రోజుల్లో రెండు విడతల్లో మిగతా నిధులు.
తొలి విడతలో భాగంగా రాష్ట్రంలోని 68,89,955 మంది రైతులకు రైతు భరోసా అందించారు. 57,44,907 ఎకరాల 19 గుంటలకు సంబంధించి రైతు భరోసా నిధులు రిలీజ్ చేశారు. ఆదివారం బ్యాంకులకు సెలవు కావడంతో నేడు ఆ మొత్తం రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. మరో 45 రోజుల్లో మిగతా రూ. 5,400 కోట్లను మరో రెండు విడతల్లో జమ చేయనున్నారు. ఎకరానికి ఏడాదికి రూ. 12 వేల నిధులు కాగా, యాసంగి సీజన్‌కు సంబంధించి ఎకరానికి రూ. 6 వేల చొప్పున నిధులు రైతులకు అందుతున్నాయి.
రైతు భరోసాలో నల్గొండ టాప్: రైతు భరోసా నిధుల్లో నల్గొండ జిల్లా టాప్‌లో నిలిచింది. ఈ జిల్లాలో 5,22,313 మంది రైతుల ఖాతాల్లో రూ. 268.57 కోట్ల నిధులు జమ కానున్నాయి. ఆ తర్వాత స్థానాల్లో ఖమ్మం, సంగారెడ్డి వంటి జిల్లాలు ఉన్నాయి.
- ఖమ్మం: 3.35 లక్షల మంది (రూ. 169.51 కోట్లు)
- సంగారెడ్డి: 3.53 లక్షల మంది (రూ. 167.80 కోట్లు)
- నాగర్ కర్నూల్: 3.01 లక్షల మంది (రూ. 157.95 కోట్లు)
- సిద్దిపేట: 3.53 లక్షల మంది (రూ. 153.44 కోట్లు)
అత్యల్పంగా మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో రూ. 10.43 కోట్ల రైతు భరోసా నిధులు జమ కానున్నాయి.
