CM Revanth Reddy : రేవంత్ రెడ్డి.. మామ్దానీని కలవడానికి భారత ప్రభుత్వం ఎందుకు ఒప్పుకోలేదు?
CM Revanth Reddy : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరించడంతో జోహ్రాన్ మమ్దానీతో ప్రతిపాదిత భేటీ అంశం చర్చనీయాంశంగా మారింది. అసలు కేంద్రం అభ్యంతరం ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం..
- Sreehari A
- Published on- August 24, 2026 / 09:43 PM IST
CM Revanth Reddy’s US Visit Row
- మమ్దానీతో మీటింగ్.. రేవంత్ అమెరికా టూర్‌కు బ్రేక్ ఎందుకు?
- రేవంత్ US టూర్‌కు కేంద్రం నో.. మమ్దానీ భేటీనే కారణమా?
- మమ్దానీని కలవడంలో తప్పేంటి? రేవంత్ టూర్‌పై అసలు వివాదం ఇదే
CM Revanth Reddy : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన ఎందుకు బ్రేక్ పడింది? రేవంత్ పర్యటనకు కేంద్ర ప్రభుత్వం ఎందుకు అనుమతి నిరాకరించింది. ఇప్పుడు ఇదే రాజకీయంగా కొత్త చర్చకు తెరతీసింది. ముఖ్యంగా న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీతో భేటీ కోసం రేవంత్ రెడ్డి అపాయింట్ మెంట్ అడిగారట..
కానీ, రేవంత్ ప్రతిపాదనను కేంద్రం తోచిపుచ్చినట్టు తెలుస్తోంది. ఇదే విషయాన్ని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు (CM Revanth Reddy) చెప్పడంతో అసలు విషయం తెరపైకి వచ్చింది. అయితే, మమ్దానీని కలవాలనుకున్నందుకే కేంద్రం అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరించిందని అధికారికంగా స్పష్టత ఇవ్వలేదు. ఇప్పుడు ఇదే అసలు ప్రశ్నగా మారింది.
కేంద్ర వర్గాల సమాచారం ప్రకారం.. రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీతో భేటీ కావాలని ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. అయితే ఈ కార్యక్రమాల విషయంలో అధికారిక మార్గం, పర్యటన ఉద్దేశం, ముఖ్యమంత్రి హోదాకు అనుగుణంగా కార్యక్రమాలున్నాయా లేదా అనే అంశాలను కేంద్రం పరిశీలించినట్లు సమాచారం.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఏమన్నారంటే? :
మరోవైపు.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు మాత్రం మమ్దానీ భేటీ అంశాన్ని నేరుగా ప్రస్తావించారు. భారత ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన వ్యక్తిగా మమ్దానీపై విమర్శలు ఉన్న నేపథ్యంలో తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ఆయనను కలవడం సమంజసమేనా అని ఆయన ప్రశ్నించారు. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్‌పై మమ్దానీ గతంలో చేసిన వ్యాఖ్యలను కూడా బీజేపీ నేతలు ప్రస్తావిస్తున్నారు.
Read Also : Kovvuri Soujanya Death Note : సౌజన్య మరణ వాంగ్మూలం.. సాదిక్‌పై సంచలన ఆరోపణలు.. 5 పేజీలో లేఖలో ఏముంది?
మమ్దానీని కలిస్తే తప్పేంటి? :
ఇక్కడే ‘మమ్దానీని కలిస్తే తప్పేంటి?’ అనే ప్రశ్న తెరపైకి వస్తోంది. మరోవైపు కేంద్రం మాత్రం ఒక్క మమ్దానీ భేటీనే కారణంగా చూపలేదు. మొత్తం పర్యటన కార్యక్రమం, దాని ప్రోటోకాల్‌కు సంబంధించిన అంశాలను కారణాలుగా పేర్కొంటోంది.
‘ఆపరేషన్ సింధూర్’పై మామ్దానీ కామెంట్స్ :
వాస్తవానికి, గతంలో ఆపరేషన్ సింధూర్ మీద ఈ న్యూయార్క్ మేయర్ మామ్దానీ వ్యతిరేకంగా కామెంట్స్ చేశాడు. భారత వ్యతిరేక భావజాలం ఉన్న వారిని భారత ప్రభుత్వంలో ఒక భాగమైన తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధిగా వెళ్లి కలవడం సరికాదని, అందుకే కేంద్రం రేవంత్ అమెరికా పర్యటనకు అనుమతించలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, న్యూయార్క్ సిటీ మేయర్ జోహ్రాన్ మమ్దానీలతో భేటీల కోసం తెలంగాణ సీఎంఓ నేరుగా సమాచారం పంపడం, ఈ వివరాలను విదేశాంగ శాఖ ద్వారా రూట్ చేయకపోవడమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు.
రేవంత్ అమెరికా టూర్‌కు అనుమతి నిరాకరణ వెనుక మమ్దానీ భేటీ ఎంతవరకు కారణం అనేది ప్రస్తుతం రాజకీయ చర్చగానే ఉంది. అధికారికంగా మాత్రం ‘మమ్దానీని కలవడం వల్లే నిరాకరించినట్టుగా ఎలాంటి స్పష్టమైన ప్రకటన కేంద్రం నుంచి రాలేదు.
