నేను బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకొచ్చా..! కేసీఆర్ వ్యాఖ్యలపై అసెంబ్లీలో సీఎం రేవంత్ సెటైర్లు..

సికింద్రాబాద్, హైదారాబాద్, సైబరాబాద్ లతో పాటు నాల్గో సిటీ ఏర్పాటు చేస్తున్నామని చెప్పిన రేవంత్.. ముచ్చర్లలో నాల్గో సిటీ ఏర్పాటు చేస్తామని అన్నారు.

CM Revanth Reddy

CM Revanth Reddy : తెలంగాణ అసెంబ్లీలో ద్రవ్యవినిమయ బిల్లుపై వాడీవేడీ చర్చ జరిగింది. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్, కేటీఆర్ లపై సెటైర్లు వేశారు. ఇటీవల బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు అసెంబ్లీకి హాజరైన కేసీఆర్ అసెంబ్లీలో మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. బడ్జెట్ లో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసింది.. అందరినీ వెన్నుపోటు పొడించిందని అన్నారు. ఈ ప్రభుత్వాన్ని అసెంబ్లీలో చీల్చిచెండాడుతా అంటూ కేసీఆర్ హెచ్చరించారు. కేసీఆర్ వ్యాఖ్యలను అసెంబ్లీలో గుర్తుచేసిన సీఎం రేవంత్ రెడ్డి.. కేసీఆర్ చీల్చి చెండాడుతా అంటే నేను బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకుని వచ్చా అంటూ రేవంత్ సెటైర్ విసిరారు. అలాగే.. కేటీఆర్ ను ఉద్దేశించి రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Also Read : మీ పదేళ్ల పాలన కోటా శ్రీనివాసరావు కోడి కథలా ఉంది.. అసెంబ్లీలో కేటీఆర్ పై మంత్రి సీతక్క ఫైర్..

కేటీఆర్ వంద పర్సెంట్ ఆర్టిఫీషియల్, సున్న పర్సెంట్ ఇంటిలిజెన్స్. కేటీఆర్ కి ఓపిక సహనం ఉండాలని రేవంత్ అన్నారు. కేటీఆర్ కి అనుకోకుండా పదవి వచ్చింది. సూచనల రూపంలో మోసాన్ని ప్రజల మెదళ్లలో కుక్కే ప్రయత్నం కేటీఆర్ చేస్తున్నారు. పది నెలలు నిండని ప్రభుత్వంపై వందల ఆరోపణలు చేస్తున్నారు. బతుకమ్మ చీరలు సిరిసిల్ల చేనేత కార్మికులు తయారు చేశారా? సూరత్ నుండి తెచ్చారా అంటూ రేవంత్ ప్రశ్నించారు. గత ప్రభుత్వం బతుకమ్మ చీరల బకాయిలు పెడితే మేం విడుదల చేశాం. ఎయిర్ పోర్టుకు ఎంఎంటీఎస్ సౌకర్యం కల్పిస్తామని కేంద్రం చేబితే వద్దని కేసీఆర్, కేటీఆర్ తిరస్కరించారని రేవంత్ అన్నారు. యంగ్ ఇండియా స్కిల్ యునివర్సిటీ రేపు ప్రారంభిస్తామని చెప్పారు. రాష్ట్రంలోని కొన్ని స్టేడియంలు, ఆట స్థలాలు తాగుబోతులకు అడ్డాలుగా మారుతున్నాయని రేవంత్ అన్నారు. నికత్ జరిన్ కి గ్రూప్ 1 ఉద్యోగం ఇస్తామని చెప్పారు.

Also Read : UPSC Chairman : యుపీఎస్సీ నూతన చైర్మన్‌గా ఏపీ కేడర్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారిణి

ఒకే దగ్గర ఫార్మా సిటీ ఉంటే కలుషితం అవుతుందని ఫార్మా విలేజ్ లో ఏర్పాటు చేస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. సికింద్రాబాద్, హైదారాబాద్, సైబరాబాద్ లతో పాటు నాల్గో సిటీ ఏర్పాటు చేస్తున్నామని చెప్పిన రేవంత్.. ముచ్చర్లలో నాల్గో సిటీ ఏర్పాటు చేస్తామని అన్నారు. పెట్టుబడులు ఎవరు పెట్టాలన్నా ముచ్చర్లకి రావాలని తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు