Comprehensive Household Census : తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వే కొనసాగుతోంది. నిన్న రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన ఇంటింటి సర్వే.. ఇవాళ కూడా కంటిన్యూ అవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇంటి నెంబర్ తో స్టిక్కర్లు అతికిస్తున్నారు సిబ్బంది. రేపటి వరకు యజమాని, ఇంటి నెంబర్ తో స్టిక్కర్లను గ్రామ పంచాయితీ, మున్సిపల్ సిబ్బంది అందిస్తున్నారు. ఈ నెల 9 నుంచి సమగ్ర కుటుంబ సర్వే ప్రారంభం కాబోతోంది. 56 ప్రధానమైన ప్రశ్నలతో పాటు 19 అనుసంధాన ప్రశ్నలతో మొత్తం 75 ప్రశ్నలతో సర్వే జరగబోతోంది.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే కొనసాగుతోంది. నిన్న రాష్ట్రవ్యాప్తంగా కుటుంబ సర్వే మొదలైంది. ముందుగా మూడు రోజుల పాటు..అంటే నిన్నటి నుంచి రేపటి వరకు ఇంటింటి సర్వేలో భాగంగా ప్రతీ కుటుంబానికి ఇళ్లను, కుటుంబ యజమానిని ఇంటి నెంబర్లతో పాటు స్టిక్కర్లు అతికించే కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమం రేపటి వరకు కొనసాగుతుంది. ఇక, 9వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో అసలైన ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే మొదలవుతుంది. ఇందుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసింది. మొత్తం 85వేల మందికిపైగా ఎన్యుమరేటర్లను ఈ మేరకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి రంగంలోకి దింపారు.
56 ప్రధానమైన ప్రశ్నలతో పాటు 19 అనుబంధ ప్రశ్నలు.. మొత్తం 75 ప్రశ్నలను కుటుంబ సర్వేలో భాగంగా ఇంటి యజమానిని అడగబోతున్నారు. అందులో ముఖ్యంగా సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్య, ఉపాధి.. ఈ అంశాలలో ఆ కుటుంబ స్థితిగతులు ఏంటని తెలుసుకునేందుకే ఈ సమగ్ర కుటుంబ సర్వే కొనసాగుతోంది.
కులం, మతంతో పాటు ఆ కుటుంబం యొక్క సమాజంలో పరిస్థితి ఏ విధంగా ఉంది, కుటుంబ ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది, ఆ కుటుంబానికి ఏమైనా అప్పులు ఉన్నాయా, అప్పులను ఏ విధంగా తీర్చబోతున్నారు, దాంతో పాటు కుటుంబానికి ఉన్న భూములు ఏంటి, అవి ఏ విధంగా సంక్రమించాయి, కుటుంబం నుంచి ఎవరైనా వలస వెళ్లారా, విదేశాల్లో ఎవరైనా చదువు కుంటున్నారా, విదేశాల్లో ఎవరైనా ఉద్యోగాలు చేస్తున్నారా.. ఇటువంటి పూర్తి సామాజిక అంశాలతో కూడిన ప్రశ్నావళి ద్వారా తెలంగాణలో ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, కుటుంబాల స్థితిగతులు ఏంటి, ఏ కులానికి సంబంధించిన వారు ఎంతమంది ఉన్నారు.. ఇటువంటి పూర్తి స్థాయి లెక్కలు సమీకరించేందుకే తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే తొలిసారి ఈ ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వేను చేపట్టింది.
Also Read : మేము మంత్రులం కాదా, మాకు వాడే అర్హత లేదా? హెలికాప్టర్ కోసం లొల్లి..