Mynampally Hanumanth Rao : ప్రజలు నాతోనే ఉన్నారు, తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే- మైనంపల్లి హనుమంతరావు

కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీ విజయం కోసం పని చేస్తా. సర్వేల ఆధారంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఖరారు చేస్తుంది. Mynampally Hanumanth Rao

Mynampally Hanumanth Rao Joins Congress (Facebook)

Mynampally Hanumanth Rao Joins Congress : నేను ప్రజల మనిషిని, నిత్యం ప్రజలతోనే ఉన్నాను, ప్రజల కోసం పని చేశానని అని మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు. ప్రజలు, కేడర్ నాతో ఉన్నారని ఆయన చెప్పారు. అంతేకాదు సర్వేలు నావైపే ఉన్నాయని విశ్వాసం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ లో నా రాజకీయ భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉండబోతుందని మైనంపల్లి హనుమంతరావు వ్యాఖ్యానించారు.

తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ గాలి వీస్తోందన్నారు. తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని జోస్యం చెప్పారు. సర్వేల ఆధారంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఖరారు చేస్తుందని మైనంపల్లి హనుమంతరావు చెప్పారు. కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీ విజయం కోసం పని చేస్తానని వెల్లడించారు. మైనంపల్లి హనుమంతరావు తన కొడుకుతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

Also Read..BRS party: ప్రధాని మోదీపై బీఆర్‌ఎస్ సరికొత్త అస్త్రం.. బీజేపీని కార్నర్ చేసేందుకు గులాబీ పార్టీ రెడీ!

ఎమ్మెల్యే మైనంపల్లితో పాటు పలువురు అధికార పార్టీ నేతలు ఇవాళ కాంగ్రెస్‌లో చేరారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో వారు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్‌లో చేరిన వారిలో మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, మైనంపల్లి రోహిత్, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, కుంభం అనిల్ కుమార్ తదితరులు ఉన్నారు. మల్లికార్జున ఖర్గే వారందరికీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. రేపు (సెప్టెంబర్ 29) వీరంతా రాహుల్ గాంధీని కలవనున్నారు. ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు షాక్ తగలగా.. చేరికలతో కాంగ్రెస్ లో జోష్ నెలకొంది. ఇతర పార్టీలకు చెందిన నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు క్యూ కడుతున్నారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న మైనంపల్లి హన్మంతరావు.. తన కొడుక్కి సీఎం కేసీఆర్ టికెట్ ఇవ్వలేదని బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పేశారు. సీఎం కేసీఆర్ అందరికన్నా ముందుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించేశారు. వారిలో సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన మైనంపల్లి హనుమంతరావుకి మరోసారి మల్కజ్ గిరి నుంచి పోటీ చేసే ఛాన్స్ ఇచ్చారు. అయితే తన కొడుక్కి మెదక్ టిక్కెట్ ఆశించారు మైనంపల్లి హనుమంతరావు. అయితే టికెట్ రాకపోవడంతో ఆయన తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరిపోయారు. మైనంపల్లి హనుమంతరావుకి రెండు టికెట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ ఓకే చెప్పడంతో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.

Also Read..Telangana BJP : గోడ దూకేస్తారా? తెలంగాణ బీజేపీలో దుమారం, పార్టీని హడలెత్తిస్తున్న ఆ నలుగురు సీనియర్లు

ట్రెండింగ్ వార్తలు