MLA Jaggareddy : కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన నిర్ణయం

కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని వ్యాఖ్యానించారు. తన స్థానంలో సంగారెడ్డి కార్యకర్తలకు అవకాశం ఇవ్వనున్నట్లు తెలిపారు.

MLA Jaggareddy

MLA Jaggareddy : కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని వ్యాఖ్యానించారు. తన స్థానంలో సంగారెడ్డి కార్యకర్తలకు అవకాశం ఇవ్వనున్నట్లు తెలిపారు. క్యాడర్ వద్దంటే తన భార్య నిర్మలను బరిలో దింపుతానని పేర్కొన్నారు. మళ్లీ 2028 ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పారు. బుధవారం(సెప్టెంబర్ 7,2022) మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన జగ్గారెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.

రాజకీయ వ్యుహంలో భాగంగానే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా పేర్కొన్నారు. తనపై ఎవరి ఒత్తిళ్లు లేవని చెప్పారు. తాను ఒక టర్మ్ ఎందుకు దూరంగా ఉంటున్నానో తర్వాత తెలుస్తుందని చెప్పారు. జగ్గారెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఇదిలా ఉంటే.. రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్రకు సంఘీభావంగా సంగారెడ్డి నియోజకర్గంలో తాను రేపటి నుంచి పాదయాత్ర చేయనున్నట్టుగా జగ్గారెడ్డి వెల్లడించారు.

Jaggareddy : బీజేపీ ఎజెండాతో కేసీఆర్‌ పని చేస్తున్నారు : జగ్గారెడ్డి

ప్రజా సమస్యలు వినే పరస్థితుల్లో ప్రభుత్వం ఉందా అని ప్రశ్నించారు. ఆరు నెలల తర్వాత మూడు రోజుల పాటే అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని అంటున్నారని పేర్కొన్నారు. మంత్రులు, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పైరవీలు చేసుకుని బతుకుతున్నారని ఆరోపించారు. ప్రజా సమస్యల గురించి ముఖ్యమంత్రిని అడిగే పరిస్థితుల్లో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు లేరని విమర్శించారు.