Telangana MLC Elections: తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్
తెలంగాణ(Telangana MLC Elections)లో జరగనున్న పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించింది.
- V Santhosh Kumar
- Published on- September 30, 2026 / 07:14 AM IST
Congress party announces candidates for Graduate MLC elections
Telangana MLC Elections: తెలంగాణ శాసనమండలికి త్వరలో జరగనున్న అత్యంత కీలకమైన పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పర్యవేక్షణలో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తికాగా, ఈ ప్రతిపాదనలకు ఆయన తుది ఆమోదం తెలిపారని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ వెల్లడించింది. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బలమైన నాయకులను బరిలోకి దించుతున్నట్లు కాంగ్రెస్ అధిష్ఠానం స్పష్టం చేసింది.
Kalki Bhagavan Passes Away: ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ కన్నుమూత
ఇరు నియోజకవర్గాలకు పోటీదారులు వీరే – అధికారిక ఉత్తర్వులు జారీ:
కీలకమైన మహబూబ్ నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ పట్టభద్రుల స్థానం నుంచి కాంగ్రెస్(Telangana MLC Elections) అభ్యర్థిగా సామ రామ్మోహన్ రెడ్డిని ఖరారు చేశారు. అలాగే నల్గొండ – ఖమ్మం – వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డికి పోటీ చేసే అవకాశం కల్పించారు. ఈ మేరకు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ అధికారిక ఉత్తర్వులను విడుదల చేశారు. పట్టభద్రుల మద్దతును గెలుచుకుని స్థానాలను కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ శ్రేణులు ఇప్పటికే క్షేత్రస్థాయి ప్రచార వ్యూహాలకు సిద్ధమవుతున్నాయి.
