Congress Protest (2)
Congress Protest : చమురు ధరల పెంపును నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ దేశ వ్యక్తంగా ఆందోళనలు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే సోమవారం మెదక్ లో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, టీపీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్, సీనియర్ నాయకురాలు మాజీ మంత్రి గీత రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్బంగా ఎద్దుల బండిని తీసుకొచ్చారు కార్యకర్తలు.. ఈ నేపథ్యంలోనే దామోదర రాజనర్సింహాతోపాటు మరికొందరు కాంగ్రెస్ నేతలు ఎద్దులబండి ఎక్కారు. ఎద్దుల బండిపై రాజనరసింహ తన ప్రసంగం ప్రారంభించారు. మైక్ సౌండు, కార్యకర్తల అరుపులకు బెదిరిన ఎద్దులు ఒక్కసారిగా కదిలాయి.
దీంతో ఎద్దులబండి కుదుపులకు గురై బండి మీదనుంచి కిందపడిపోయారు రాజనరసింహ. ఈ ప్రమాదంలో ఆయన మోకాలికి గాయమైంది. వెంటనే తేరుకున్న సెక్యూరిటీ సిబ్బంది ఆయనను పక్కకు లాగారు. ఈ ప్రమాదంతో నిరసన కార్యక్రమ అర్దాంతరంగా ముగిసింది.
Former Dy CM of United #AndhraPradesh Damodar Raja Narasimha injured after fall from a bullock cart during #FuelPriceHike protest organised by #Congress party in Medak of #Telangana pic.twitter.com/MmQ9jantc8
— Aashish (@Ashi_IndiaToday) July 12, 2021