తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో కొత్తగా 1,018 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 17,357కి చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో 4,234 టెస్టులు నిర్వహించగా 1,018 పాజిటివ్ కేసులు వచ్చాయి.
తాజాగా కరోనా నుంచి కోలుకున్న 788 మంది డిశ్చార్జ్ కావడంతో.. ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 8,082గా నమోదైంది. ప్రస్తుతం రాష్ట్రంలో 9,008 యాక్టివ్ కేసులు ఉన్నాయి. బుధవారం కరోనాతో మరో ఏడుగురు మృతి చెందడంతో మొత్తం మృతుల సంఖ్య 267కి చేరింది. తాజాగా నమోదైన కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 881 ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
మేడ్చల్ 36, రంగారెడ్డి 33, మహబూబ్ నగర్ 10, వరంగల్ రూరల్ 9, మంచిర్యాల 9, ఖమ్మం 7, నల్గొండ 4, జగిత్యాల 4, సిద్దిపేట 3, నిజామాబాద్ 3, ములుగు 2, అసిఫాబాద్ 2, కామారెడ్డి 2, మెదక్ 2, ఆదిలాబాద్ 2, యాదాద్రి భువనగిరి 2,
సంగారెడ్డి 2, కరీంనగర్ 2, సూర్యాపేట 2, గద్వాల 1 చొప్పున కేసులు నమోదు అయ్యాయి.