Corona For 35 Students At Government Girls School Manchirala And Positive For Six Parents1
Corona for 35 students : తెలంగాణలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. రోజురోజుకూ కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. మంచిర్యాల జిల్లాలో కరోనా కలవర పెడుతోంది. మంచిర్యాల ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో.. కరోనా విజృంభించింది. 175 మందికి పరీక్షలు నిర్వహించగా 35 మంది విద్యార్థులకు పాజిటివ్ వచ్చింది.
విద్యార్థులతో పాటు ఆరుగురు తల్లిదండ్రులకు వైరస్ సోకింది. దీంతో వైరస్ బాధితులను హోం క్వారంటైన్‌లో ఉండాలని స్కూలు ప్రిన్సిపాల్ సూచించారు. కరోనా వ్యాప్తితో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది.
జిల్లాలోని చెన్నూర్ పట్టణంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో నిన్న ఓ ఉపాధ్యాయునికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అవ్వగా.. ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. ఇందులో భాగంగా పాఠశాలలోని ఉపాధ్యాయులకు, విద్యార్ధులకు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు.
మరోవైపు కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల అనుబంధ గ్రామం గుడ్డేలుగులపల్లిలో కరోనా కలకలం రేగింది. ఇవాళ 130 మంది గ్రామస్థులకు కరోనా పరీక్షలు చేయగా.. 20 మందికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. రామడుగు పీహెచ్‌సీ ఆధ్వర్యంలో వైద్యాధికారులు ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేశారు.