పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్ టోల్ గేట్ సిబ్బందికి కరోనా..10 మందికి పాజిటివ్

Corona for Basanth Nagar toll gate staff : తెలంగాణలో మళ్లీ కరోనా మహమ్మారి కలకలం రేపుతోంది. కరోనా అదుపులోకి వచ్చిందని ప్రభుత్వం, ప్రజలు ఊపిరిపీల్చుకునే లోపే మళ్లీ అలజడి మొదలైంది. రాష్ట్రంలో గత కొంతకాలంగా తగ్గుమఖం పట్టిన కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. పెద్దపల్లి జిల్లా బసంత్‌నగర్‌ టోల్‌గేట్‌ సిబ్బందికి కరోనా సోకడం కలకలం రేపుతోంది.

10 మంది సిబ్బందికి కరోనా నిర్థారణ అయ్యింది. టోల్‌గేట్‌లో మొత్తం 100 మంది వరకు సిబ్బంది ఉన్నారు. అందరికీ పరీక్షలు చేస్తే మరిన్ని కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. మరోవైపు టోల్‌గేట్‌ యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

సిబ్బందికి మాస్కులు, గ్లౌజులు యాజమాన్యం ఇవ్వడం లేదని ఉద్యోగులు చెబుతున్నారు. రోజూ వేలాది వాహనాలకు సిబ్బంది టోల్‌ అందిస్తుంటారు. దీంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు.