హైదరాబాద్ కలెక్టరేట్ లో కరోనా కలకలం రేపింది. ఇద్దరు ఉన్నతాధికారులతో పాటు ఆరుగురు ఉద్యోగులకు కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో మిగతా ఉద్యోగుల్లో భయాందోళన మొదలైంది. అధికారులు కలెక్టర్ కార్యాలయాన్ని శానిటైజేషన్ చేశారు. హైదరాబాద్ నగరంలో ఉండే కార్యాలయాల్లో కలెక్టర్ కార్యాలయం ఒకటి. ప్రజలతో నిత్యం రద్దీగా ఉండే కార్యాలయం. ముఖ్యంగా పించన్ల కోసం, ఇతర అవసరాల కోసం నిత్యం ప్రజలు వస్తుంటారు.
ఈ సందర్భంలో అక్కడి ఆరుగురు ఉద్యోగులు, ఇద్దరు ఉన్నతాధికారులు ఉంటారు. ఒక ఉన్నతాధికారి కరోనా సోకింది. అయితే వారందరినీ హోంఐసోలేషన్ లో ఉంచి ట్రీమ్ మెంట్ చేస్తున్నారు. అందరు కూడా ఎక్కువగా లక్షణాలు లేకుండా నార్మల్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఒకేసారి ఇంత మందికి కరోనా సోకడంతో అక్కడ పని చేసే ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది.
జీహెచ్ఎంసీకి సంబంధించిన శానిటైజేషన్ సిబ్బంది శానిటైజ్ చేసి క్లీన్ చేశారు. అయితే ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇటు జీహెచ్ఎంసీ గానీ, సెక్రటేరియట్ గానీ మిగతా కార్యాలయాలకు సంబంధించి వరుసగా డాక్టర్లు పోలీసులతోపాటు రెవెన్యూ సిబ్బంది కూడా ఈ కోవలోకి వచ్చారు.
ప్రధానంగా ప్రధాన కార్యాలయం కలెక్టర్ తోపాటు అందులోని సిబ్బంది కోవిడ్ బారిన పడటంతో అక్కడ పని చేసే వారిలో కొంత ఆందోళన కనిపిస్తోంది. కొంత హాజరు శాతం కూడా తగ్గింది. రెగ్యులర్ గా వారితో పని చేసే వారు కూడా పది రోజులపాటు హోంఐసోలేన్ ఉండాలని నిర్ణయించడంతో కొంత హాజరు శాతం తగ్గింది.