తెలంగాణలో కరోనా ఉధృతి –  @644 కేసులు..18కి చేరిన మృతులు.

  • Publish Date - April 15, 2020 / 12:29 AM IST

తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. మరిన్ని పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. అందరూ కేసులు తగ్గుముఖం పడుతాయని అనుకుంటున్న క్రమంలో కరోనా వైరస్ లక్షణాలు బయటపడుతున్నాయి. మరో 52 కొత్త కేసులు 2020, ఏప్రిల్ 14వ తేదీ మంగళవారం వెలుగు చూడడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. రాష్ట్రంలో వైరస్ బాధితుల సంఖ్య 644కి పెరిగింది. చికిత్స పొందుతున్న వారిలో ఏడుగురు డిశ్చార్జ్ అయ్యారు. వేర్వేరు ఆసుపత్రుల్లో 516 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో మృతుల సంఖ్య 18కి చేరింది. 

ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ లో కేసులు అధికంగా నమోదవుతుండడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ఫస్ట్ కాంటాక్ట్ వారితో సన్నిహితంగా ఉన్న దాదాపు 900 మందిని క్వారంటైన్ కు తరలించి నమూనాలు సేకరించారు. వెల్లడవుతున్న ఫలితాల్లో ఫస్ట్ కాంటాక్ట్, సెకండ్ కాంటాక్ట్ వ్యక్తులే ఉండడం గమనార్హం. 

ఇటీవలే ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్ ఘటన అనంతరం కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. వీరిని క్వారంటైన్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం వీరి గడువు ముగియబోతోంది. కానీ కొత్త వారికి ఎలా వైరస్ సోకిందనే ప్రశ్నలకు సమాధానం దొరకడం లేదు. 

మొత్తం బాధితులు : 644
చికిత్స పొందుతున్న వారు : 516
డిశ్చార్జ్ అయిన వారు : 110
మృతులు : 18

Also Read | సీఎం సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యేకి కరోనా..అందరిలో టెన్షన్