హైదరాబాద్ ను కరోనా వైరస్ టెన్షన్ పెడుతోంది. శంషాబాద్ విమానాశ్రయంలో కరోనా కలకలం రేపింది. విదేశాల నుంచి వచ్చిన ఇద్దరికి కరోనా లక్షణాలు కనిపించాయి.
హైదరాబాద్ ను కరోనా వైరస్ టెన్షన్ పెడుతోంది. శంషాబాద్ విమానాశ్రయంలో కరోనా కలకలం రేపింది. విదేశాల నుంచి వచ్చిన ఇద్దరికి కరోనా లక్షణాలు కనిపించాయి. అధికారులు అప్రమత్తం అయ్యారు. వారిని వెంటనే చికిత్స నిమిత్తం అంబులెన్స్ లో ఫీవర్ ఆస్పత్రికి తరలించారు. వారిని ఐసోలేషన్ వార్డులో ఉంచి పరీక్షలు నిర్వహించనున్నారు.
విదేశాల నుంచి వచ్చే ప్రతి ఒక్కరిని థర్మల్ స్క్రీనింగ్ లో పరీక్షలు చేసిన తర్వాత ఇక్కడి నుంచి తరలిస్తున్నారు. దుబాయ్ వరకు తమకు ఎలాంటి స్క్రీనింగ్ జరుగలేదని బ్రిటీష్ ఎయిర్ వేస్ లో చవ్చని ప్రయాణికులు చెప్పారు. వర్బల్ క్వెశ్చన్స్ అడిగారని తెలిపారు. దుబాయ్ లో తమకు సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ ఇచ్చారని పేర్కొన్నారు.
తెలంగాణలో డైరెక్ట్ పాజిటివ్ కేసులు నమోదు కాలేదు. విదేశాల నుంచి వచ్చిన పాజిటివ్ కేసుపై ప్రభుత్వం యుద్ధం ప్రకటించింది. కరోనా బాధితుడు కలిసి, మాట్లాడిన ప్రతి ఒక్కరినీ తీసుకొచ్చి టెస్ట్‌లు చేసి వైరస్ వ్యాప్తి చెందకుండా కట్టడి చేయగలిగింది. మరోవైపు బాధితుడికి మెరుగైన సేవలు అందించి త్వరగా అతగడు కోలుకునేలా అన్ని చర్యలు తీసుకుంది.
తెలంగాణలో కరోనాపై యుద్ధం ప్రకటించిన ప్రభుత్వం.. దానిని నియంత్రించడంలో సఫలం అవుతోంది. గాంధీలో చికిత్స పొందుతోన్న యువకుడికి కరోనా నెగెటివ్ ఇచ్చింది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ…. సూచనలు , సలహాలు ఇస్తూ కట్టడికి చర్యలు తీసుకున్నారు.
మరోవైపు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతూ వారిచ్చే సూచనలు పాటించారు. ఫలితంగా కొత్త కేసులు నమోదు కాలేదు. కరోనా బాధపడిన యువకుడూ కోలుకున్నాడు. దీంతో ప్రస్తుతం తెలంగాణలో ఒక్క కేసు కూడా లేదు.
See Also | అద్భుతమైన ఫీచర్లు, 5G సపోర్టుతో Redmi K30 Pro ఫోన్