ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి అందరికీ కన్నీళ్లు పెట్టిస్తుంది. చైనాలో పుట్టి ప్రపంచం మొత్తం ఇబ్బంది పడుతుంది. ఇటలీలో కరోనా దెబ్బకు చనిపోయిన వ్యక్తులతో శవాలు గుట్టలు గుట్టలు అవుతున్నాయి. మనదేశంలో కూడా కరోనా మహమ్మారి ఇబ్బంది పెట్టేస్తుంది. పలు రాష్ట్రాల్లో ఇబ్బంది పెడుతున్న కరోనా వైరస్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కూడా తన ప్రభావం చూపిస్తుంది.
లేటెస్ట్‌గా దేశమంతటా జనతా కర్ఫ్యూ పాటించిన రోజే.. తెలంగాణలో ఆరు కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో కోవిడ్-19 కేసులు 27కు చేరుకున్నాయి. ఇప్పటికే ఒకరు కోలుకోగా.. మరో 26 మంది మాత్రం చికిత్స చేయించుకుంటున్నారు. కరోనా బాధితుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.
ఇతర దేశాల నుంచి వచ్చిన వారికి మాత్రమే కరోనా సోకిందని.. కేవలం ఒకే ఒక్కరికి ప్రైమరీ కాంటాక్ట్ (కరోనా బాధితుడి నుంచి మరొకరికి సోకడం) ద్వారా వైరస్ సోకిందని ప్రభుత్వం స్పష్టం చేసింది. సామాజిక దూరం, వ్యక్తిగత శుభ్రత పాటిస్తే కరోనా రాదని ప్రతి ఒక్కరు అందుకు సహకరించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.
P-22: గుంటూరుకు చెందిన 24ఏళ్ల యువకుడికి కరోనా సోకింది. లండన్‌లో నుంచి ఇటీవలే దుబాయ్ మీదుగా అతడు హైదరాబాద్ వచ్చాడు.
P-23: కూకట్ పల్లికి చెందిన 23 ఏళ్ల యువకుడికి కోవిడ్-19 వ్యాధి వచ్చింది. లండన్‌లో పర్యటించిన ఇతడు దోహా మీదుగా హైదరాబాద్ వచ్చాడు.
P-24: తూర్పు గోదావరి జిల్లా రాజోలుకు చెందిన 26 ఏళ్ల విద్యార్థికి కరోనా రాగా.. స్వీడన్ నుంచి మార్చి 16న అతడు హైదరాబాద్ వచ్చాడు.
P-25: హైదరాబాద్ మణికొండకు చెందిన 34 ఏళ్ల వ్యక్తికి కరోనా వచ్చింది. స్వీడన్‌లో పర్యటించిన బాధితుడు మార్చి 14న హైదరాబాద్ వచ్చాడు.
P-26: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంకు చెందిన 23 ఏళ్ల యువకుడికి కరోనా వచ్చింది. లండన్‌లో పర్యటించిన అతను మార్చి 18న హైదరాబాద్ వచ్చాడు.
P-27: హైదరాబాద్‌కు చెందిన 50 ఏళ్ల మహిళకు కోవిడ్-19 వ్యాధి వచ్చింది. దుబాయ్‌లో పర్యటించిన ఆమె మార్చి 14న హైదరాబాద్ వచ్చింది.
See Also | ఎవరు బతుకుతారు..ఎవరు చనిపోతారు : కరోనా వంటి సందర్భాల్లో ఛాయిస్ వారిదే