Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి కోర్టు షాక్.. రెండు రోజుల పోలీస్ కస్టడీ!
Uday Krishna Reddy : లైంగిక వేధింపుల కేసు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డికి కోర్టులో తీవ్ర ఎదురుదెబ్బ తగిలింది. రెండు రోజుల పోలీసు కస్టడీకి కోర్టు అనుమతించింది.
- Sreehari A
- Published on- August 5, 2026 / 10:04 PM IST
Uday Krishna Reddy
- ఉదయ్ కృష్ణారెడ్డికి కోర్టులో ఎదురుదెబ్బ
- రెండు రోజుల పోలీస్ కస్టడీ కోర్టు అనుమతి
- ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో కృష్ణారెడ్డిపై విచారణ
Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి కోర్టు షాక్ ఇచ్చింది. లైంగిక వేధింపుల కేసులో విచారణ కీలక దశకు చేరుకుంది. ఈ కేసులో భాగంగా ఉప్పర్‌పల్లి కోర్టు బుధవారం (ఆగస్టు 5) ఆయనకు రెండు రోజుల పాటు పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
కోర్టు అనుమతి మేరకు రాజేంద్రనగర్ సబ్‌డివిజన్ పోలీసులు గురువారం, శుక్రవారం ఉదయ్ కృష్ణారెడ్డిని కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు. ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో కృష్ణారెడ్డిని ప్రశ్నించనున్నట్లు అత్తాపూర్ సీఐ తెలిపారు.
Read Also : Madhavan-CM Vijay : ‘మంచి చేసినా విమర్శలు తప్పవు’.. తమిళ రాజకీయాలపై మాధవన్ ఆసక్తికర కామెంట్స్
ఓ మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిణి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు నమోదైన సంగతి తెలిసిందే. తనపై ఉదయ్ కృష్ణారెడ్డి లైంగిక వేధింపులకు పాల్పడటంతో పాటు భౌతిక దాడి కూడా పాల్పడ్డాంటూ ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ ఫిర్యాదును పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి ఉదయ్‌ను అరెస్ట్ చేసి అనంతరం కోర్టులో హాజరుపరిచారు. అయితే, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, ఆరోపణల్లోని వాస్తవాలు, అందుబాటులో ఉన్న ఆధారాలపై స్పష్టత కోసం పోలీస్ కస్టడీ విచారణ కీలకంగా మారింది. విచారణలో వెలుగులోకి వచ్చే అంశాల ఆధారంగా కేసు దర్యాప్తు తదుపరి దశకు వెళ్లే అవకాశం ఉంది.
