Suryapet : ఆస్తికోసం అత్తను హత్య చేయించిన కోడలు
ఆస్తికోసం అత్తనే హత్య చేయించింది కోడలు.. ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది. ఆస్తి తన పేర రాయడం లేదనే కోపంతో అత్తను హత్య చేయించింది.
- kunduru Vinod
- Published On : August 15, 2021 / 03:53 PM IST
Suryapet
Suryapet : ఆస్తికోసం అత్తనే హత్యచేయించింది కోడలు.. ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే జిల్లాలోని కుసుమవారిగూడెం గ్రామానికి చెందిన లలితమ్మ అనే మహిళకు ఇద్దరు కూతుర్లు, ఓ కుమారుడు. వీరందరికి వివాహం అయింది. వివాహం సమయంలో కూతుర్లకు కట్నంగా చెరో ఎకరం ఇచ్చారు. ఇంకా మూడున్నర ఎకరాల పొలం లలితమ్మ పేరుమీద ఉంది. అయితే ఏడాది క్రితం లలితమ్మ భర్త చనిపోయాడు.. నాటి నుంచి ఆమెపై ఉన్న మూడున్నర ఎకరాల పొలాన్ని తనపైకి రాయాలని కోడలు విజయలక్ష్మి అత్తతో గొడవ చేస్తుంది.
భర్త చనిపోయిన సమయంలో ఉన్న డబ్బు మొత్తం కూతుర్లకు ఇచ్చిందని.. పొలం కూడా వారికే ఇచ్చేలా ఉన్నవని తరచూ లలితమ్మతో గొడవ పడేది విజయ లక్ష్మి. ఎన్నిసార్లు పొలం తమ పేరుమీద పట్టా చేయాలని అడిగినా అత్త వినకపోవడంతో, అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది కోడలు విజయలక్మి. అన్నుకున్నదే తడవుగా అత్త దగ్గర పొలం పని చేస్తున్న సైదులుని సంప్రదించి హతమార్చేలా ఒప్పించింది.
దీంతో ఒంటరిగా నిద్రిస్తున్న లలితమ్మను కత్తితో సైదులు హతమార్చాడు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సూర్యాపేట రూరల్ పోలీసులు, మృతురాలి దగ్గర పనిచేసే సైదులు ప్రవర్తన మీద అనుమానం వచ్చి తమదైన శైలిలో విచారించగా అసలు నిజం ఒప్పుకున్నాడు. నిందితులు విజయలక్మి, సైదులు ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
