CP CV Anand : కేబీఆర్ పార్క్ చుట్టూ 264 సీసీ కెమెరాలు.. 15 నిమిషాల్లో నేరం చేసిన వ్యక్తిని గుర్తిస్తున్నాం : సీపీ సీవీ ఆనంద్

సీసీ కెమెరాల ఏర్పాటుకు విరాళాలు ఇచ్చిన దాతలను సీపీ సత్కరించారు. దేశంలో అత్యధిక సీసీ కెమెరాలు ఉన్న నగరం హైదరాబాద్ అని పేర్కొన్నారు.

CP CV Anand

KBR Park CC Cameras :సేఫ్ సిటీ ప్రాజెక్ట్ లో భాగంగా హైదరాబాద్ కేబీఆర్ పార్క్ చుట్టూ కమ్యూనిటీ సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. కేబీఆర్ పార్క్ చుట్టూ 264 సీసీ కెమెరాలు అమర్చారు. కేబీఆర్ పార్క్ చుట్టూ 80 లక్షలతో 152 కెమెరాలు, రోడ్ నెంబర్ 36, రోడ్ నెంబర్ 45, చెక్ పోస్ట్ లను కవర్ చేస్తూ మరో 112 కెమెరాలు ఏర్పాటు చేశారు. దాతల సహాయంతో మొత్తంగా 264 సీసీ కెమెరాలను పోలీసులు ఏర్పాటు చేశారు. శనివారం కేబీఆర్ పార్క్ చుట్టూ 264 కమ్యూనిటీ సీసీ కెమెరాలను సీపీ సీవీ ఆనంద్ ప్రారంభించారు.

సీసీ కెమెరాల ఏర్పాటుకు విరాళాలు ఇచ్చిన దాతలను సీపీ సత్కరించారు. అందుబాటులోకి వచ్చిన 264 సీసీ కెమెరాల ద్వారా నిరంతర నిఘా ఉంటుంది. ఈ సందర్భంగా సీపీ సీవీ ఆనంద్ సీసీ కెమెరాల ఏర్పాటుకు విరాళాలు ఇచ్చిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల సహకారంతోనే పెద్ద ఎత్తున సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం సాధ్యం అయిందన్నారు. కమ్యూనిటీ సీసీ టీవీ ప్రాజెక్టు యజ్ఞంలా చేశామని తెలిపారు. మేము సైతం ప్రాజెక్ట్ కింద ఐదు లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు అయ్యాయని పేర్కొన్నారు.

Hyderabad : హైదరాబాద్‌లో కాల్పుల కలకలం.. కార్తీకదీపం నటుడిపై కేసు

సబ్సిడీ ప్రాజెక్టులో భాగంగా మరొక 2,500 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఇన్ని లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన తర్వాత మెయింటనెన్స్ కష్టంగా మారిందన్నారు. కెమెరాలు రెండు మూడు సంవత్సరాల వరకు పనిచేయగలుగుతాయని, ఆపై మొరాయిస్తాయని చెప్పారు. కేబీఆర్ పార్క్ దగ్గర కూడా కొన్ని చోట్ల కెమెరాలు పనిచేయడం మానేశాయని చెప్పారు. కేబీఆర్ దగ్గర ఏదైనా ఇష్యూ జరిగితే పెద్ద ఎత్తున విమర్శలు వస్తాయని తెలిపారు. అందుకే తిరిగి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని భావించామని వెల్లడించారు.

కోవిడ్ తర్వాత దాతల నుండి ఫండ్ రైసింగ్ చేయడం చాలా కష్టంగా మారిందన్నారు. ఎట్టకేలకు దాతల సహకారంతో 264 సీసీ కెమెరాంలో ఏర్పాటు చేయగలిగామని పేర్కొన్నారు. పార్కు లోపల ఏదైనా జరిగితే తమకు సంబంధం లేదన్నారు. ఒక వ్యక్తి పార్క్ లోపల దాక్కుని వాకింగ్ కు వచ్చిన వారిని వేధించాడని.. అతనిపై పీడీ యాక్ట్ పెట్టామని తెలిపారు. దేశంలో అత్యధిక సీసీ కెమెరాలు ఉన్న నగరం హైదరాబాద్ అని పేర్కొన్నారు.

Medchal : ప్రియురాలి భర్తపై ప్రియుడు కాల్పులు

15 నుండి 20 నిమిషాల్లో నేరం చేసిన వ్యక్తిని సీసీ కెమెరాల ద్వారా గుర్తించగలుగుతున్నామని తెలిపారు. ఆరు చోట్ల చైన్ స్నాచింగ్లకు పాల్పడిన ఓ నేరగాళ్ల ముఠాను గంటలో గుర్తించామని చెప్పారు. ఇవన్నీ నగరంలో ఉన్న సీసీ కెమెరాల ద్వారానే సాధ్యమవుతుందన్నారు. నగరంలో అన్ని విభాగాలకు సంబంధించిన లక్ష సీసీ కెమెరాలు కమాన్ కంట్రోల్ సెంటర్ కు అనుసంధానమై ఉన్నాయని తెలిపారు. దేశ, విదేశాల్లో ఎక్కడా లేని విధంగా కమాండ్ కంట్రోల్స్ సెంటర్ ఏర్పాటు చేసుకున్నామని పేర్కొన్నారు.