Huzurabad Bypoll: కారుకా.. కాంగ్రెస్‌కా..! సీపీఐ మద్దతెవరికి?

తెలంగాణలో రాజకీయ కాకరేపిన హుజూరాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు రంగం సిద్ధమవుతోంది. ఉప ఎన్నిక నిర్వహణకు డిసెంబరు వరకు సమయమున్నా..

Huzurabad by-poll: తెలంగాణలో రాజకీయ కాకరేపిన హుజూరాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు రంగం సిద్ధమవుతోంది. ఉప ఎన్నిక నిర్వహణకు డిసెంబరు వరకు సమయమున్నా ముందుగానే ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తుంది. అక్టోబరు లేదా నవంబరు మొదటి వారంలోగా ఇతర రాష్ట్రాల నియోజకవర్గాలలో ఎన్నికలు జరపాల్సిన పరిస్థితిలో వాటితో పాటే హుజురాబాద్ ఉపఎన్నికను నిర్వహించే అవకాశం కనిపిస్తుంది. ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయన్నది ఎలా ఉన్నా ఇప్పటికే అన్ని పార్టీలు హుజురాబాద్ టార్గెట్ గా వేగంగా పావులు కదుపుతున్నాయి.

ఇప్పటికే అన్ని ప్రధాన పార్టీలు హుజురాబాద్ టార్గెట్ గా ప్రచారం సాగిస్తున్నాయి. ఏ పార్టీకి ఏ ప్రాంతాల్లో పట్టుంది?.. అభ్యర్థులు కానున్న వారికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటి.. మైనస్ లేంటి.. ఇలా ఆసక్తికరంగా రాజకీయ చర్చలు కూడా జరుగుతున్నాయి. ఇలాంటి చర్చల్లో భాగంగా సీపీఐ పార్టీ మద్దతు ఎవరికి అన్నది కీలకంగా మారింది. హుజురాబాద్ ఉపఎన్నికలలో పోటీచేయడం లేదని సీపీఐ ఇప్పటికే ప్రకటించడంతో మద్దతు ఎవరికి ఇస్తారన్నది ఆసక్తిగా మారింది.

పార్టీ భావజాలం దృష్ట్యా.. ఇతరత్రా కారణాలతో లెఫ్ట్ పార్టీ భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చే అవకాశం లేదని విశ్లేషకుల అభిప్రాయం. ఇక మిగిలింది టీఆర్ఎస్ పార్టీ.. కాంగ్రెస్ పార్టీ. ఇందులో లెఫ్ట్ పార్టీ ఏ పార్టీకి మద్దతు ఇవ్వనుంది?. గత రెండు ఉప ఎన్నికలలో అప్పటి పరిస్థితుల దృష్ట్యా టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చారు. కొంత కాలంగా కమ్యూనిస్టు నేతలు మాత్రం ఇక్కడ ఈ రెండు పార్టీలతో సమదూరం పాటిస్తున్నారు. మరి.. ఇప్పుడు ఏ పార్టీకి మద్దతు ఇవ్వనున్నారన్నది తేలాల్సి ఉంది.

ట్రెండింగ్ వార్తలు