Veeramachineni Ramakrishna: వీరమాచినేని రామకృష్ణపై క్రిమినల్ కేసు.. VRK డైట్‌తో లా విద్యార్థికి ప్రాణాంతకం.. రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్!

ప్రముఖ డైట్ ప్రాచుర్యకర్త వీరమాచినేని రామకృష్ణ(Veeramachineni Ramakrishna)తో పాటు కోటేశ్వరరావు అనే వ్యక్తిపై రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదైంది.

criminal case registered at Raidurgam police station against Veeramachaneni Ramakrishna and VRK Diet.

Veeramachineni Ramakrishna: ప్రముఖ సోషల్ మీడియా పర్సనాలిటీ, డైట్ ప్రాచుర్యకర్త వీరమాచినేని రామకృష్ణ (Veeramachineni Ramakrishna) తో పాటు కోటేశ్వరరావు అనే వ్యక్తిపై సైబరాబాద్ పరిధిలోని రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదైంది. వైద్యార్హతలు లేకుండా ఫేక్ డాక్టర్‌గా వ్యవహరిస్తూ, అవైజ్ఞానిక ప్రచారాలతో మోసం చేయడమే కాకుండా ప్రాణాలకు తీవ్ర ముప్పు కలిగించారనే ఆరోపణలతో పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. టైప్-1 డయాబెటిస్‌తో బాధపడుతున్న 30 ఏళ్ల లా విద్యార్థి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఈ సంచలన చర్యలు తీసుకున్నారు.

Diesel Shortage: డీజిల్ వినియోగదారులకు షాక్.. విక్రయాలపై మళ్ళీ కేంద్రం ఆంక్షలు.. రోజుకి ఎన్ని లీటర్లో తెలుసా?

ఇన్సులిన్ నిలిపివేతతో ప్రాణాపాయం.. ఆస్పత్రిపాలైన లా విద్యార్థి:

ఫిర్యాదుదారుడి కథనం ప్రకారం.. 2018 నుంచి టైప్-1 డయాబెటిస్‌తో బాధపడుతున్న అతను, సోషల్ మీడియాలో VRK డైట్‌తో వ్యాధి నయమవుతుందన్న ప్రచారం చూసి వీరమాచినేనిని సంప్రదించారు. వారి సూచనల మేరకు ఇన్సులిన్ తీసుకోవడం ఆపేయగా, కేవలం రెండు రోజుల్లోనే డయాబెటిక్ కీటో ఆసిడోసిస్, తీవ్ర డీహైడ్రేషన్‌కు గురై ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. ఈ చికిత్సకు రూ. 58,219 ఖర్చు అవ్వగా, అంతకుముందు VRK హెల్త్ కేర్ సెంటర్‌లో సప్లిమెంట్లు, సేవల కోసం మరో రూ. 26,000 చెల్లించినట్లు బాధితుడు పేర్కొన్నారు.

పలు చట్టాల కింద కేసులు.. వినియోగదారుల కోర్టులోనూ పిటిషన్:

బాధితుడి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు బీఎన్‌ఎస్ (BNS) సెక్షన్లు 318(4), 125(ఏ), 61(2)లతో పాటు నేషనల్ మెడికల్ కమిషన్ చట్టంలోని సెక్షన్ 54, డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ యాక్ట్ సెక్షన్లు 3, 4 కింద తీవ్రమైన కేసులు నమోదు చేశారు. మోసపూరిత సలహాలతో తన ప్రాణాల మీదికి తెచ్చినందుకు పరిహారం చెల్లించాలని కోరుతూ బాధితుడు నాంపల్లి వినియోగదారుల కోర్టును కూడా ఆశ్రయించారు. ఈ వ్యవహారంపై పోలీసులు ప్రస్తుతం సమగ్ర విచారణ జరుపుతున్నారు.