Cyclone Akwan : దూసుకొస్తున్న ఆక్వాన్ తుపాను.. తెలంగాణలోని ఈ జిల్లాల్లో దంచికొట్టనున్న వానలు

Cyclone Akwan : ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఆదివారం ఉదయం వాయుగుండంగా మారింది.. సోమవారంకు తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో ఏపీతోపాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు.

Telangana Weather

Cyclone Akwan : ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఆదివారం ఉదయం వాయుగుండంగా రూపాంతరం చెందింది. ఇది క్రమంగా తీవ్రవాయుగుండంగా మారి సోమవారం నాటికి తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ తుపానుకు ‘అక్వాన్’ అని నామకరణం చేశారు. ఈ తుపాను కారణంగా ఏపీతోపాటు తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది.

Also Read : Srisailam Iconic Bridge : శ్రీశైలం వెళ్లేవారికి అదిరిపోయే శుభవార్త.. ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణానికి సర్వే.. రాత్రివేళల్లోనూ ప్రయాణించొచ్చు..

బంగాళాఖాతంలోని వాయుగుండం ప్రస్తుతం అండమాన్ దీవులుకు 700 కి. మీ., చెన్నైకు 860 కి. మీ. విశాఖపట్నంకు 1040 కి. మీ., గోపాల్‌పూర్ ఒడిశా)కు1160 కి. మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. సోమవారం తుపానుగా బలపడే అవకాశం ఉంది. మంగళవారం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆ తరువాత ఉత్తరాంధ్ర తీర ప్రాంతానికి చేరుకునే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.

ఈ తుపాను ప్రభావంతో ఉత్తరాంధ్రలో గురు, శుక్రవారాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు, రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ, ఆర్టీజీఎస్ సీఈవో ప్రఖర్ జైన్ తెలిపారు.

ఈ తుపాను ప్రభావంతో తెలంగాణలోనూ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నవంబర్ 20 నుంచి 22 వరకు తెలంగాణలోని తూర్పు, దక్షిణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. 21, 22 తేదీల్లో రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో కూడా తుపాను ప్రభావం కనిపిస్తుందని అధికారులు తెలిపారు.