×
Ad

ఇన్‎స్టా‎గ్రామ్ లవర్ కోసం ఇంజక్షన్లు ఇచ్చి తల్లిదండ్రులను చంపేసిన కూతురు.. దేవుడా..

ప్రేమ వివాహానికి తల్లిదండ్రులు నిరాకరించడంతో వారిని చంపేసింది. నిందితురాలి ఇంటి నుంచి ఖాళీ ఇంజక్షన్ బాటిళ్లు, వాడిన సిరంజీలను స్వాధీనం చేసుకున్నారు.

  • వికారాబాద్ జిల్లా యాచారంలో ఘటన
  • ప్రైవేటు ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న సురేఖ
  • ప్రేమ వివాహానికి ఒప్పుకోవడం లేదని హత్య

Vikarabad District: వికారాబాద్ జిల్లాలో ఓ యువతి దారుణానికి పాల్పడింది. ప్రేమ వివాహానికి పెద్దలు అంగీకరించడం లేదని తల్లీదండ్రులకు మత్తు ఇంజక్షన్ ఇచ్చి చంపింది.

బంట్వారం మండలం యాచారం గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ గ్రామానికి చెందిన దశరథ్, లక్ష్మి దంపతుల కూతురి పేరు సురేఖ. సంగారెడ్డిలోని ప్రైవేట్ ఆసుపత్రిలో సురేఖ నర్సుగా పనిచేస్తోంది. ఆ యువతికి కొన్నాళ్ల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ యువకుడితో పరిచయం ఏర్పడి, ప్రేమాయణం కొనసాగించింది.

YS Jagan : 150 నియోజకవర్గాల్లో.. ఏడాదిన్నర పాటు పాదయాత్ర.. జగన్ 2.0లో వాళ్లకే పెద్దపీట

వేరే కులానికి చెందిన యువకుడు కావడంతో వారి వివాహానికి తల్లిదండ్రులు నిరాకరించారు. దీంతో వారిని చంపేయాలని సురేఖ ప్లాన్ వేసుకుంది. ఆసుపత్రి నుంచి మత్తు ఇంజక్షన్లు దొంగతనంగా తీసుకొచ్చింది. ఈ నెల 24వ తేదీ రాత్రి తల్లిదండ్రులకు అధిక మోతాదులో ఇంజక్షన్లు ఇచ్చి హత్య చేసింది. వాటిని సహజ మరణాలుగా చిత్రీకరించేందుకు ప్రయత్నించింది.

తన అన్నకు తప్పుడు సమాచారం ఇచ్చింది. పోలీసులు దర్యాప్తు ప్రారంభించి, నిందితురాలి ఇంటి నుంచి ఖాళీ ఇంజక్షన్ బాటిళ్లు, వాడిన సిరంజీల స్వాధీనం చేసుకున్నారు. ప్రేమ వివాహం కోసం ముందుగానే హత్యకు ప్రణాళిక వేసుకున్నానని పోలీసుల విచారణలో నిందితురాలు అంగీకరించింది. నిందితురాలిని అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు.