DAV Public School Issue : డీఏవీ స్కూల్ మేనేజ్ మెంట్, పేరెంట్స్ తో విద్యాశాఖ కమిషనర్ చర్చలు ముగిశాయి. పేరెంట్స్, మేనేజ్ మెంట్ విజ్ఞప్తులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని కమిషనర్ హామీ ఇచ్చారు. డీఏవీ స్కూల్ రీఓపెన్ పై స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ సానుకూలంగా మాట్లాడారని స్కూల్ మేనేజ్ మెంట్ అదే విధంగా పేరెంట్స్ చెబుతున్నారు. త్వరలో స్కూల్ రీ ఓపెన్ అవుతుందని పేరెంట్స్ అంటుండగా, లోపాలను సరిదిద్దుకుంటామని కమిషనర్ తో చెప్పింది స్కూల్ మేనేజ్ మెంట్.
ఎడ్యుకేషన్ కమిషనర్ తో జరిగిన చర్చల్లో.. స్కూల్‌ని రీ-ఓపెన్ చేయాలని తల్లిదండ్రులు కోరగా, గుర్తింపు రద్దు నిర్ణయం వెనక్కి తీసుకోవాలని మేనేజ్ మెంట్ కోరింది. విద్యాశాఖ నిర్ణయంపై తల్లిదండ్రుల్లో ఉత్కంఠ నెలకొంది.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.
బంజారాహిల్స్ డీఏవీ స్కూల్ లో ప్రిన్సిపాల్ కారు డ్రైవర్ రజనీకుమార్.. ఎల్కేజీ చదువుతున్న నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన ఘటన సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దీన్ని సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం పాఠశాల గుర్తింపును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. కాగా, స్కూల్ ని రీఓపెన్ చేయాలని, ప్రభుత్వం స్వాధీనం చేసుకుని రన్ చేయాలని పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు.
అసలేం జరిగిందంటే..
బంజారాహిల్స్ డీఏవీ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ కారు డ్రైవర్ రజనీకుమార్.. ఎల్కేజీ చదువుతున్న చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. డిజిటల్ క్లాస్ రుమ్లోకి తీసుకెళ్లి దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘటన తెలిసిన వెంటనే తల్లిదండ్రులు ఆగ్రహానికి గురయ్యారు. డ్రైవర్‌ను చితకబాది పోలీసులకు అప్పగించారు. కీచకుడు స్కూళ్లో మరికొంత మంది విద్యార్థులపైనా లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని పోలీసుల విచారణలో తేలింది.
కీచకుడు రజినీ కుమార్తో పాటు ప్రిన్సిపాల్ మాధవిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు మాధవిపై కేసు నమోదైంది. నిందితుడిపై అత్యాచారం కేసుతో పాటు పోక్సో యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు.