Cold Waves : తెలంగాణలో పెరుగుతున్న చలి-తగ్గుతున్న ఉష్ణోగ్రతలు

తెలంగాణలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో చలి తీవ్రత కాస్త పెరిగింది. రాత్రి పూట ఉష్ణో గ్రతలు కూడా తీవ్రంగా పడిపోతున్నాయి.

Cold Waves :  తెలంగాణలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో చలి తీవ్రత కాస్త పెరిగింది. రాత్రి పూట ఉష్ణో గ్రతలు కూడా తీవ్రంగా పడిపోతున్నాయి. శనివారం ఆదిలాబాద్ లో 13.2, మెదక్ లో 17.3, నిజామాబాద్ లో 17.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వచ్చే మూడు రోజుల్లో రాష్ట్రంలో పొడివాతావరణం ఉంటుందని.. ఎలాంటి వాతావరణ హెచ్చరికలు లేవని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. హైదరాబాద్ లో కూడా చలిపెరిగింది. ఆదివారం ఉదయం 9 గంటల వరకు పొగమంచు కప్పేయటంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.

ట్రెండింగ్ వార్తలు