Arvind Kejriwal, Kavitha
Delhi Liquor Policy Case : ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఉపముఖ్యమంత్రి సిసోదియాతోపాటు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితలకు క్లీన్‌చిట్ ఇచ్చింది. వారిపై సీబీఐ నమోదు చేసిన అభియోగాలన్నింటిని కోర్టు కొట్టివేసింది. ఈ మేరకు సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి జితేందర్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. కవితతో పాటు ఈ కేసులో 23 మంది నిందితులు తప్పు చేశారని సాక్షాదారాలు లేవని కోర్టు స్పష్టం చేసింది.
కోర్టు తాజా తీర్పుతో దేశ రాజధానిలో మద్యం అమ్మకాలకు కొత్త విధానాన్ని రూపొందించడంలో అవినీతి జరిగిందనే ఆరోపణల కేసులో ఆప్‌కు పెద్ద ఉపశమనం లభించినట్లయింది. కోర్టు తీర్పు అనంతరం అరవింద్ కేజ్రీవాల్ సెంట్రల్ ఢిల్లీలోని కోర్టు వెలుపల మీడియాతో మాట్లాడారు. సత్యం చివరికి గెలుస్తుందని ఎప్పుడూ చెబుతూనే ఉన్నా.. సత్యం మావైపై ఉంది. ఇంటి నుంచి బయటకు లాగి జైల్లో పడేశారని, మాపై బురద జల్లారు అంటూ కేజ్రీవాల్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.