Site icon 10TV Telugu

బిగ్ బ్రేకింగ్.. హైదరాబాద్‌లో డెంగ్యూ కేసు.. అప్రమత్తమైన బల్దియా అధికారులు

Hyderabad: వర్షాకాలం మొదలు కావడంతో పలు రకాల వ్యాధుల ముప్పు పొంచిఉంటుంది. ముఖ్యంగా నీటి ద్వారా సంక్రమించే వ్యాధులు, దోమల ద్వారా వచ్చే వ్యాధులు, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. వీటికితోడు వర్షాకాలంలో నీటి నిల్వలు పెరగడం వల్ల దోమలు వృద్ధి చెంది డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలుతాయి. వర్షాకాలం సీజన్‌లో వ్యాధులు విజృంభించకుండా ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుంది. అయితే, రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో డెంగ్యూ పాజిటివ్ కేసు నమోదైనట్లు తెలిసింది.

 

నగరంలోని బన్సీలాల్ పేట డివిజన్ లోని కీస్ బ్లాక్ జైనగర్ లో ఓ వ్యక్తికి డెంగ్యూపాజిటివ్ రావడంతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. గురువారం డిప్యూటీ కమిషనర్ డాకు నాయక్ ఆధ్వర్యంలో ఎంటమాలజీ బృందం కాలనీని సందర్శించింది. దోమల నివారణకు మందులు స్ర్పే చేసి, ఫాగింగ్ నిర్వహించారు. స్థానికులు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, నీటి నిల్వ ఉంచుకోవద్దని సూచించారు.

Exit mobile version