ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. దసరా అడ్వాన్స్ వచ్చేస్తోంది..

అడ్వాన్స్‌ను ఉద్యోగులకు ఇవ్వాలంటూ సంబంధిత అధికారులకు సజ్జనార్‌ సూచించారు.

ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. దసరా అడ్వాన్స్ వచ్చేస్తోంది..

Updated On : September 23, 2025 / 7:52 AM IST

TGRTC: తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌. దసరా పండుగ వస్తుండడంతో వారికి అడ్వాన్స్ ఇవ్వాలని యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. డ్రైవర్లతో పాటు కండక్టర్లు, సూపర్ వైజర్లు, శ్రామిక్‌లకు ఇస్తారు. వారి నెల జీతం ఆధారంగా అడ్వాన్స్‌ అందనుంది.

ఈ అడ్వాన్స్‌ను తిరిగి వారి వేతనం నుంచి నెలకు కొంత చొప్పున యాజమాన్యం కట్ చేస్తుంది. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఇప్పటికే ఆర్టీసీ ఉన్నతాధికారులతో భేటీ అయి నిర్ణయం తీసుకున్నారు. అడ్వాన్స్‌ను ఉద్యోగులకు ఇవ్వాలంటూ సంబంధిత అధికారులకు సజ్జనార్‌ సూచించారు.

Also Read: Pawan Kalya : కార్యకర్తకు పెద్ద పదవి.. పవన్ కల్యాణ్ స్ట్రాటజీ అదేనా..?

కాగా, దసరా పండగ నేపథ్యంలో ఉద్యోగులకు బోనస్‌ ఇవ్వాలని ఆర్టీసీ ఉద్యోగ సంఘం కొన్ని రోజులుగా యాజమాన్యాన్ని కోరుతోంది. టీజీఆర్టీసీని లాభాల బాటలో నడిపించేందుకు కృషి చేస్తున్నామని చెప్పింది.

తెలంగాణలో మహాలక్ష్మి పథకాన్ని కూడా విజయవంతంగా అమలు చేసేందుకు తోడ్పాటు అందిస్తున్నామని తెలిపింది. వారి కోరిక మేరకు అడ్వాన్స్‌ ఇవ్వాలని యాజమాన్యం నిర్ణయం తీసుకుంది.