AP Deputy CM Pawan Kalyan
Pawan Kalyan approaches to Delhi High Court : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. వ్యక్తిత్వ హక్కులను కాపాడాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఉల్లంఘనలకు పాల్పడుతూ తన ఫోటోలు, వీడియోలను దుర్వినియోగం చేసే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై చర్యలు తీసుకోవాలని పిటిషన్
లో పవన్ కల్యాణ్ కోరారు.
ఇప్పటికే సీనియర్ హీరోలు చిరంజీవి, నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్ వ్యక్తిత్వ హక్కులను కాపాడాలని కోరుతూ కోర్టును ఆశ్రయించి రక్షణ పొందిన విషయం తెలిసిందే.. వారి బాటలోనే తాజాగా.. పవన్ కల్యాణ్ కూడా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.