దిశ ఉసురు తగిలింది : పాపం వారిది.. శాపం ఎవరికి?

  • Publish Date - December 6, 2019 / 11:02 AM IST

దుర్మార్గుల చేతిలో చిత్రహింసలకు గురై..నరక యాతన అనుభించిన దిశ ఉసురు..నిందితుల కుటుంబ సభ్యులను తగిలింది. అయినవారిని కోల్పోయి కంటికి మంటికీ ఏకధాటిగా ఏడుస్తున్నారు నిందితుల కుటుంబ సభ్యులు. ఎన్ కౌంటర్ లో కుక్క చావు చచ్చినవారి కోసం విలపిస్తున్నారు. కానీ పాపం చేసింది వారు..ఘోరానికి పాల్పడింది ఆ నలుగురే..కానీ శాపం తగిలింది కుటుంబాలకు.

నవ్వుతూ బైటకెళ్లిన దిశ అత్యంత దారుణంగా దుర్మార్గులు అరిఫ్, నవీన్, చెన్నకేశవులు,శివ చేతుల్లో పాశవికంగా బలైపోయింది. దిశ నిందితుల్ని ఎన్ కౌంటర్ చేయటంతో దేశ ప్రజలంతా హర్షం వ్యక్తంచేస్తున్నారు. వాళ్లు చేసింది తప్పే గానీ వారి చావుతో మాకు దిక్కేది అంటూ..నిందితుల కుటుంబ సభ్యులు ఏడుస్తున్నారు. కడుపు శోకంతో ఓ తల్లి ఏడుస్తుంటే గర్భంతో ఉన్న మరో నిందితుడు భార్య అమాయకంగా తన భర్త వస్తాడని ఎదురు చూసింది. కానీ కుక్క చావు చచ్చిపోయిన భర్త కోసం ఏడుస్తుంది ఏ4 నిందితుడి చెన్నకేశవులు భార్య. 

ఆమె  ఏడుపు చూస్తే నేరం చేసింది చెన్నకేశవులే అయినా జీవితాంతం శిక్ష అనుభవిచాల్సింది ఈమే కదా అనిపించక మానదు. నా భర్తను పంపిస్తామని చెప్పారు..ఏడి సార్ నా భర్త అని ఆమె అమాయకత్వంతో ప్రశ్నిస్తూ ఏడుస్తోంది గర్భంతో ఉన్న చెన్నకేశవులు భార్య. నా మొఖమన్నా చూడలేదే అంటూ ఏడుస్తోంది. అటువంటి దుర్మార్గుడి భార్య అయినందుకు ఆమె జీవితం నాశమైందనే బాధ కలిగిస్తోంది. 

జొల్లు శివ తల్లిదండ్రులు
నా కొడుకు చేసింది నేరమే..ఘోరమే..ఓ ఆడబిడ్డ మానప్రాణాలు తీసిన శివ దుర్మార్గుడే. కానీ ఇంతకంటే నేరాలు..గోరాలు చేసినవారిని ఇలాగే చంపారా? వారికి శిక్షలు వేశారా? అని ప్రశ్నిస్తున్నారు.   నేరం చేసిందుకు తమ కొడుక్కి శిక్ష విధించాలి..జైల్లో పెట్టాలి..కానీ ఇలా చంపేయటం ఎంతవరకూ సమంజసం అని ప్రశ్నిస్తున్నారు.