Mla Padi Kaushik Reddy Vs Mla Sanjay : కరీంనగర్ కలెక్టరేట్ లో జిల్లా సమీక్ష సమావేశం రసాభాసగా మారింది. ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, సంజయ్ కుమార్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత తోపులాటకు దారితీసింది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ది ఏ పార్టీ అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు. మీది ఏ పార్టీనో చెప్పాలని పదే పదే ఆయనను నిలదీశారు. సంజయ్ కుమార్ టార్గెట్ గా పాడి కౌశిక్ రెడ్డి రెచ్చిపోయారు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. తోపులాటకు దారితీసింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు పాడి కౌశిక్ రెడ్డిని అక్కడి నుంచి బయటకు తీసుకెళ్లిపోయారు.
నువ్వు ఏ పార్టీ అంటూ సంజయ్ కుమార్ తో వాగ్వాదం..
ఉమ్మడి కరీంనగర్ జిల్లా సమీక్ష సమావేశంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు, మంత్రులు అంతా హాజరయ్యారు. దీనికి హాజరైన హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మధ్య వాగ్వాదం జరిగింది. మాట మాట పెరిగి తోపులాట చోటు చేసుకుంది. సంజయ్ కుమార్ పార్టీ మారడంపై కౌశిక్ రెడ్డి ఫైర్ అయ్యారు.
Also Read : ఫార్ములా ఈ-కార్ రేసు, హైడ్రాపై దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు
దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని సవాల్..
నువ్వు ఏ పార్టీ ఎమ్మెల్యేవి చెప్పాలంటూ సంజయ్ కుమార్ తో కౌశిక్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. తాను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనని సంజయ్ కుమార్ చెప్పారు. అయితే, బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారని, దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని సంజయ్ ను సవాల్ చేశారు పాడి కౌశిక్ రెడ్డి.
కౌశిక్ రెడ్డి బలవంతంగా బయటకు తీసుకెళ్లిన పోలీసులు..
ఈ క్రమంలో ఇద్దరి మధ్య తోపులాట జరిగింది. అక్కడే ఉన్న ఇతర ఎమ్మెల్యేలు వారిని వారించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కౌశిక్ రెడ్డి కోపంతో ఊగిపోయారు. కేసీఆర్ దయవల్లే సంజయ్ కుమార్ ఎమ్మెల్యేగా గెలిచారని వ్యాఖ్యానించారు. అక్కడే ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు ఈ అనూహ్య ఘటనతో షాక్ కి గురయ్యారు. కౌశిక్ రెడ్డిని కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. కానీ, కౌశిక్ రెడ్డి శాంతించలేదు. కోపంతో ఊగిపోయారు. అక్కడి నుంచి కౌశిక్ రెడ్డి కదలకపోవడంతో గొడవ మరింత పెద్దదవుతున్న తరుణంలో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు.
ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని పోలీసులు బలవంతంగా బయటకు తీసుకెళ్లారు. అక్కడే ఉన్న కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పోలీసులను వారించే ప్రయత్నం చేశారు. ఎందుకు కౌశిక్ రెడ్డిని బయటకు పంపిస్తున్నారని ప్రశ్నించారు. కౌశిక్ రెడ్డి, సంజయ్ కుమార్ మధ్య వాగ్వాదం, తోపులాటతో అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కరీంనగర్ కలెక్టరేట్ ఆవరణలో టెన్షన్ వాతావరణం ఏర్పడింది.
Also Read : రైతు భరోసా మార్గదర్శకాలు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం.. వారు మాత్రమే అర్హులు