Danam Nagender: ఫార్ములా ఈ-కార్ రేసు, హైడ్రాపై దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు

ఫార్ములా ఈ-కార్ రేసు కేసు, హైడ్రాపై ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. నేను ఏది మాట్లాడినా కూడా సెన్సేషన్ అవుతుందని..

Danam Nagender: ఫార్ములా ఈ-కార్ రేసు, హైడ్రాపై దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు

MLA Dana Nagender

Updated On : January 12, 2025 / 1:26 PM IST

Danam Nagender: ఫార్ములా ఈ-కార్ రేసు కేసు, హైడ్రాపై ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. నేను ఏది మాట్లాడినా కూడా సెన్సేషన్ అవుతుంది. ఈ కార్ రేసు వల్ల హైదరాబాద్ ఇమేజ్ పెరిగిందని నేను చెబుతున్నా. కానీ, అవినీతి జరగలేదని నేను చెప్పలేదని దానం అన్నారు. నేనేమీ కేటీఆర్ కు క్లీన్ సర్టిఫికెట్ ఇవ్వలేదు. ఈ- కారు రేసు పెట్టినప్పుడు కేటీఆర్ నా సలహా తీసుకున్నారు. దానిపై నా ఒపీనియన్ మాత్రమే చెప్పాను. ఈ-కార్ రేస్ వల్ల హైదరాబాద్ ఇమేజ్ పెరిగిందని దానం చెప్పారు.

Also Read: Rythu Bharosa: రైతు భరోసా మార్గదర్శకాలు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం.. వారు మాత్రమే అర్హులు

పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి..
హైదరాబాద్ కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువగా ఉందని ఇక్కడికి కొన్ని సంస్థలు వచ్చి స్థిరపడ్డాయి. హైదరాబాద్ సేఫెస్ట్ సిటీ కాబట్టి ముంబై కి వెళ్ళే ఇన్వెస్టర్లు ఇక్కడి కి వస్తున్నారు. కేటీఆర్ కేసు కోర్టులో ఉంది.. నేను కేటీఆర్ పై మాట్లాడనని దానం అన్నారు. పదేళ్ల అనంతరం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్ర బడ్జెట్ చూస్తే ఖాళీగా ఉంది.. అయినా ఇచ్చిన హామీలను నెరవేర్చాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం ముందుకెళ్తుంది. రుణమాఫీ, రైతు భరోసా అమలు జరుగుతున్నందున సీఎం రేవంత్ రెడ్డికి పాలాభిషేకం చేయాలని దానం వ్యాఖ్యానించారు. ప్రభుత్వ పథకాలను కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లకపోతే వ్యాక్యూమ్ ఏర్పడుతుందని అన్నారు.

Also Read: టాక్ ఆఫ్ ది తెలంగాణ పాలిటిక్స్‌గా దానం నాగేందర్.. ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేలా ఎందుకు మాట్లాడుతున్నట్లు?

హైడ్రాపై ఏమన్నారంటే..
హైడ్రాపై నా వ్యాఖ్యలు ఇప్పుడు కూడా మారదు. హైడ్రా వల్ల పార్టీకి నష్టం జరిగింది. ప్రభుత్వం ఆలోచించి హైడ్రాపై మరోసారి ఆలోచన చేయాలని దానం నాగేందర్ కోరారు. మూసీకి ఆనుకుని హైకోర్టు, ఉస్మానియా లాంటి ఎన్నో చారిత్రక నిర్మాణాలు ఉన్నాయని అన్నారు.

మూసీ ప్రక్షాళన చేసి సుందరీకరణ చేయాల్సిన అవసరం ఉందని దానం పేర్కొన్నారు. మూసీపై బీజేపీ నేతలు కంటి తుడుపు చర్యల్లా ఒక్కరోజు మూసీ నిద్ర చేశారు. వారు నిద్ర చేయడానికి వెళ్లేముందే ఏసీలు పెట్టించుకుని పడుకున్నారని దానం ఆరోపించారు. వారి ఇళ్లలో చేసిన జొన్న రెట్టెలు తినకుండా కిషన్ రెడ్డి బయట నుంచి ఇడ్లీలు తెప్పించుకుని తిన్నాడంటూ దానం విమర్శలు చేశారు. ఉపఎన్నిక విషయంపై ప్రస్తావించగా.. నేను ఫైటర్ ను, ఉపఎన్నికకు భయపడనని పేర్కొన్నారు.