Adilabad : మద్యం మత్తులో భార్యతో గొడవ పడి.. స్తంభం ఎక్కి విద్యుత్ తీగలను పట్టుకొని ఆత్మహత్యాయత్నం
మావల పోలీస్ స్టేషన్ పరిధిలోని కేఆర్ కే కాలనీకి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ బాలు అలియాస్ ప్రవీణ్ తన భార్యతో గొడవ పడ్డాడు. మద్యం మత్తులో ఉన్న బాలు ఆత్మహత్య చేసుకుంటానని కాలనీలోని విద్యుత్ స్తంభం ఎక్కాడు.
- bheemraj
- Published On : July 25, 2023 / 11:51 AM IST
man attempt kills himself
Man Attempt Kills Himself : ఆదిలాబాద్ జిల్లాలో మద్యం మత్తులో భార్యతో గొడవ పడిన వ్యక్తి స్తంభం ఎక్కి విద్యుత్ తీగలను పట్టుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఓ వ్యక్తి మద్యం మత్తులో భార్యతో గొడవ పడి ఆత్మహత్య చేసుకునేందుకు స్తంభం ఎక్కి విద్యుత్ తీగలను పట్టుకొని వేలాడాడు. సకాలంలో విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో ప్రాణాలతో బయటపడ్డాడు.
మావల పోలీస్ స్టేషన్ పరిధిలోని కేఆర్ కే కాలనీకి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ బాలు అలియాస్ ప్రవీణ్ తన భార్యతో గొడవ పడ్డాడు. మద్యం మత్తులో ఉన్న బాలు ఆత్మహత్య చేసుకుంటానని కాలనీలోని విద్యుత్ స్తంభం ఎక్కాడు. ఇది గమనించిన స్థానికులు వెంటనే విద్యుత్ సరఫరా నిలిపివేయించారు.
Medak Tragedy : సంతానం కలగలేదని దంపతులు ఆత్మహత్య.. ఏడేళ్ల క్రితం ప్రేమ వివాహం
స్తంభం ఎక్కిన బాలు కొద్దిసేపు అలాగే విద్యుత్ తీగలకు వేలాడాడు. స్థానికులు ఎంత చెప్పినా వినలేదు. కొద్దిసేపటి తర్వాత తీగలను వదిలేసి, కిందపడ్డాడు. చికిత్స కోసం గాయపడ్డ బాలును స్థానికులు ఆటోలో రిమ్స్ కు తరలించారు. డాక్టర్లు అతనికి వైద్యం అందిస్తున్నారు.
