Drunkard With Snake : త్రాచు పాముతో తాగుబోతు యాచన…. హడలి పోయిన స్ధానికులు

తాగిన మైకంలో ఏమి చేస్తున్నాడో తెలియకుండా ఒక యువకుడు త్రాచు పామును మెడలో వేసుకుని జనాన్ని భయభ్రాంతులకు గురిచేశాడు.

Medak Snake Drunken Man

Drunkard With Snake :  తాగిన మైకంలో ఏమి చేస్తున్నాడో తెలియకుండా ఒక యువకుడు త్రాచు పామును మెడలో వేసుకుని జనాన్ని భయభ్రాంతులకు గురిచేశాడు. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంలోని 111 డివిజన్ భారతినగర్‌లో జరిగిన ఈ ఘటనతో స్ధానికులు హడలిపోయారు.

Also Read : Shilpa Chowdary Case : శిల్పా చౌదరి-ముగిసిన మొదటిరోజు కస్టడీ

ఆరు అడుగుల త్రాచు పామును ఒక తాగుబోతు తన మెడలో వేసుకొని దాన్ని చూపిస్తూ… ప్రతి ఒక్కరిని బెదిరిస్తూ డబ్బులు అడగటం మొదలుపెట్టాడు. డబ్బులు ఇవ్వని వారిపై పామును విసిరే ప్రయత్నం చేశాడు.

దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.  అక్కడికి చేరుకున్న పోలీసులు పాము పట్టేవారిని పిలిపించి పామును పట్టుకున్నారు. తాగుబోతును హెచ్చరించి అక్కడ నుంచి పంపించివేశారు.