Karthika Masam : భక్తులతో కిక్కిరిసిన దేవాలయాలు

కార్తీకమాసం.. ఆదివారం సెలవుదినం కావడంతో దేవాలయాల్లో భక్తుల రద్దీ పెరిగింది. తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలకు భక్తులు పోటెత్తారు.

Karthika Masam

Karthika Masam : కార్తీకమాసం.. ఆదివారం సెలవుదినం కావడంతో దేవాలయాల్లో భక్తుల రద్దీ పెరిగింది. తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. భద్రాద్రి, యాదాద్రికి భక్తులు పెద్ద సంఖ్యలో రావడంతో దర్శనానికి రెండు గంటల సమయం పడుతుంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అధికారులు ముందుగానే అన్ని ఏర్పట్లు చేశారు.

చదవండి : Karthika Masam : భక్తులతో కిక్కిరిసిన దేవాలయాలు

యాదాద్రి స్వామి వారి ధ‌ర్మ ద‌ర్శ‌నానికి 2 గంట‌లు, ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నానికి గంట స‌మ‌యం ప‌డుతోంది. భ‌క్తులు అధికంగా స‌త్య‌నారాయ‌ణ స్వామి వ్ర‌తంలో పాల్గొంటున్నారు. అభివృద్ధి ప‌నుల దృష్ట్యా కొండ‌పైకి వాహ‌నాల‌ను అనుమ‌తించ‌డం లేదు. మరోవైపు వేములవాడ, కొండగట్టు, కాళేశ్వరం దేవాలయాలకు కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

చదవండి : Karthika Masam : శివకేశవులకు ప్రీతికరం….కార్తీక మాసం….ప్రతిరోజు పర్వదినమే!..