Earthquake
Earthquake : భూ ప్రకంపనలతో మంచిర్యాల షెకయింది. జిల్లా కేంద్రంలోని కాలేజీ రోడ్ చున్నంబట్టి వాడ, శ్రీశ్రీ నగర్, సీతారాంపల్లి, నస్పూర్, సీతా రాంపూర్ తదితన ప్రాంతాల్లో రెండు సెకండ్ల పాటు స్వల్పంగా భూమి కంపించిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఒక్కసారిగా భూ ప్రకంపనలు రావడంతో ప్రజలు భయంతో పరుగులు తీశారు. భూప్రకంపననల తీవ్రత రిక్టర్ స్కేలుపై 4గా నమోదు అయింది. సీసీసీ నాగార్జున కాలనీలోనూ భూమి కంపించింది. కరీంనగర్ జిల్లా నుంచి 45 కిలోమీటర్ల దూరంలో స్వల్ప భూకంపం సంభవించింది. ఈ భూకంపం వల్ల ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
చదవండి : Earthquake: లడఖ్‌లో భూకంపం