MP Nama Nageswara Rao : టీఆర్ఎస్ ఎంపీ ఇంట్లో ఈడీ సోదాలు..రూ.1064 కోట్ల బ్యాంకు ఫ్రాడ్

టీఆర్ఎస్ నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

Ed Raids On Trs Mp Nama Nageswara Raos House

MP Nama Nageswara Rao : టీఆర్ఎస్ నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లోని ఆయన ఇంట్లో తనిఖీలు జరుపుతున్నారు. రుణాల పేరుతో బ్యాంకులను సుమారు రూ.1064 కోట్లకు మోసం చేసినట్లు వచ్చిన అభియోగాలతో ఈడీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. నామాకు చెందిన మధుకాన్‌ గ్రూప్‌ సంస్థలు సహా ఐదు చోట్ల ఈ సోదాలు కొనసాగుతున్నాయి.

నామాతో పాటు మధుకాన్‌ డైరెక్టర్ల ఇళ్లలోనూ సోదాలు కొనసాగుతున్నాయి. రాంకీ ఎక్స్‌ప్రెస్‌ హైవే ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో తీసుకున్న రుణాలను దారి మళ్లించారనే ఆరోపణలతో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఆయా సంస్థల అకౌంట్లు, డాక్యుమెంట్లు, కాంట్రాక్టులకు సంబంధించిన కీలక సమాచారాన్ని సేకరిస్తున్నారు.

ఏకకాలంలో నామా ఇంటితో పాటు ఆఫీసుల్లో సోదాలు చేస్తున్నారు. నామాతో పాటు రాంచీ ఎక్స్‌ప్రెస్‌వే సీఎండీ కె. శ్రీనివాస్‌, కంపెనీ డైరెక్టర్లు సీతయ్య, పృథ్వీ తేజ నివాసాల్లోనూ ఈడీ సోదాలు చేస్తోంది.