ఈఎస్ఐ స్కామ్‌లో ఖైదీగా ఉన్న జాయింట్ డైరక్టర్ పద్మ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆమె ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపింది. మనస్తాపానికి గురై జైల్లోనే నిద్ర మాత్రలు మింగినట్లు సమారం. ఈ ఘటన తెలుసుకున్న తర్వాత ప్రాథమిక చికిత్సకు ప్రయత్నించినప్పటికీ ఆరోగ్యం విషమంగా ఉండటంతో జైలు అధికారులు హుటహుటిన ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
ప్రస్తుతం ఎమర్జెనీ వార్డులో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా సంచలన సృష్టించిన ఈఎస్‌ఐ స్కామ్ కేసులో పలువురిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.