Eteal To Huzurabad : రేపు హుజూరాబాద్‌కు ఈటల.. ఆ 3 గ్రామాల్లో రోడ్‌షో..
మాజీ మంత్రి ఈటల రాజేందర్ మంగళవారం (జూన్ 8)న కరీంనగర్ జిల్లా, హుజూరాబాద్‌కు వెళ్లనున్నారు. ఢిల్లీ నుంచి వచ్చాక మొదటిసారి హుజూరాబాద్ ఆయన వెళ్తున్నారు.
- Sreehari A
- Published On : June 7, 2021 / 08:37 PM IST
Eteal To Huzurabad
Eteal To Huzurabad Tour : మాజీ మంత్రి ఈటల రాజేందర్ మంగళవారం (జూన్ 8)న కరీంనగర్ జిల్లా, హుజూరాబాద్‌కు వెళ్లనున్నారు. ఢిల్లీ నుంచి వచ్చాక మొదటిసారి హుజూరాబాద్ ఆయన వెళ్తున్నారు. ఈ సందర్భంగా ఈటల మూడు గ్రామాల్లో రోడ్‌షో నిర్వహించనున్నారు. కమలాపూర్, శంభునిపల్లి, కానిపర్తి గ్రామాల్లో రోడ్ షో నిర్వహించి అనంతరం మూడు గ్రామాల ప్రజలతో ఈటల చర్చించే అవకాశం ఉంది.
మరోవైపు హుజూరాబాద్ ఉప ఎన్నికపై టీఆర్ఎస్ ఫోకస్ పెడుతోంది. హుజురాబాద్ ఉపఎన్నికను టీఆర్‌ఎస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఈటల ప్రాతినిధ్యం వహించే హుజూరాబాద్ అసెంబ్లీకి త్వరలోనే ఉప ఎన్నిక జరగనున్నట్టు కనిపిస్తోంది. టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా చేశారు.
దాంతో 6 నెలల్లో ఎప్పుడైనా హుజరాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనుంది. ఈటల మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ తర్వాత ఆయన ఎమ్మెల్యే పదవికి, టీఆర్‌ఎస్‌కు సభ్యత్వానికి రాజీనామా చేసేశారు. కమలం పార్టీ తరఫున ఈటల ఎన్నికల బరిలో దిగనున్నారు.
