సంపాదించుకోటానికి ఇది సమయం కాదు… ప్రైవేట్ ఆస్పత్రులకు ఈటల సూచన

Etela Comments On Covid Hospital Bills

Etela comments on Private Hospital Bills : కోవిడ్ వైరస్ అడ్డం పెట్టుకుని సంపాదించుకోటానికి ఇది సమయం కాదని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. రాష్ట్రాంలోని పలు ప్రయివేట్ ఆస్పత్రులు కోవిడ్ పేరుతు ప్రజల వద్ద నుంచి లక్షలకు లక్షలు వసూలుచేస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చాయని వారిపై సరైన సమయంలో చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

ప్రైవేట్ ఆస్పత్రుల్లో సాధారణ పడకకు రోజుకు రూ. 4 వేలు, ఐసీయూ (వెంటిలేటర్ సౌకర్యం లేకుండా) రూ.7,500…. వెంటిలేటర్ సౌకర్యం ఉంటే రూ.9 వేలు, అదనపు మందులు చార్జీలు వసూలు చేయాలని ప్రభుత్వం గతంలోనే జీవో ఇచ్చిందని..అది ఇంకా అమల్లో ఉందని ఈటల చెప్పారు.

కరోనా పరీక్ష (ఆర్టీపీసీఆర్ టెస్ట్ కు) రూ. 500 ఇంటికి వచ్చి శాంపిల్ తీసుకు వెళ్ళి రిపోర్టు ఇస్తే రూ.750 వసూలు చేయాలని చెప్పామని… కొందరు ఈ నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయని ఈటల అన్నారు.

కోవిడ్ పేషెంట్ల పట్ల ప్రయివేట్ ఆస్పత్రులు ఉల్లంఘనకు పాల్పడుతున్నారని… ఆస్పత్రుల యాజమాన్యాలు ప్రజలను వేధింపులకు గురి చేయవద్దని ఆయన కోరారు. బిల్లు చెల్లిస్తే కానీ శవాన్నీ ఇవ్వటంలేదని కొన్నిచోట్ల నుంచిఫిర్యాదులు వచ్చాయని ప్రైవేట్ ఆస్పత్రులు ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని ఈటల హెచ్చరించారు.